• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • CASE FILED ON CHEVELLA MP KONDA VISWESWAR REDDY FOR HARASSING POLICEMEN AK

పోలీసులను హింసించిన తెలంగాణ ఎంపీ ?

పోలీసులను హింసించిన తెలంగాణ ఎంపీ ?

కాంగ్రెస్ నేత విశ్వేశ్వర్ రెడ్డి(ఫైల్ ఫోటో)

తనకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన పోలీసులను గదిలో బంధించి చిత్ర హింసలు పెట్టారనే ఆరోపణలపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది.

  • Share this:
    చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నారు. తనకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన పోలీసులను గదిలో బంధించి చిత్ర హింసలు పెట్టారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. కొద్దిరోజుల క్రితం ఆయన అనుచరుడైన సందీప్ రెడ్డి దగ్గర దొరికిన నగదుకు సంబంధించి అంశంపై నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ఆయన కార్యాలయానికి వెళ్లారు. ఈ సమయంలో తమను బంధించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఆయన అనుచరులు చిత్రహింసలు పెట్టారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ ఫిర్యాదు చేశారు.

    లోక్ సభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు కొండా విశ్వేశ్వర్ రెడ్డి సన్నిహితుడు సందీప్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున చేవేళ్ల ఎంపీగా విజయం సాధించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆయన చేవేళ్ల ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.
    First published: