అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు...కోర్టు ఆదేశాల మేరకు..

Akbaruddin owaisi | కోర్టు ఆదేశాల మేరకు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

news18-telugu
Updated: August 2, 2019, 6:57 PM IST
అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు...కోర్టు ఆదేశాల మేరకు..
అక్బరుద్దీన్ (File)
  • Share this:
మజ్లిస్ ముఖ్యనేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై కరీంనగర్‌లో కేసు నమోదైంది. గత నెల 23న కరీంనగర్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న అక్బరుద్దీన్ ఓవైసీ... ఇరు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయంలో అక్బరుద్దీన్‌కు పోలీసులకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఆయన చేసిన ప్రసంగం చట్ట వ్యతిరేకంగా లేదని తేల్చారు. దీనిపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ అంశంపై కరీంనగర్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసిన అక్బరుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలని కోర్టును అభ్యర్థించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు...అక్బరుద్దీన్‌పై వివిధ సెక్షన్ల ఆధారంగా కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఒవైసీపై ఐపీసీ సెక్షన్ 153-ఏ, 153-బి, 506, సీఆర్పీసీ 156(3) కింద కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు కరీంనగర్‌ త్రి టౌన్ పోలీస్ స్టేషన్‌లో నేడు కేసు నమోదైంది.

First published: August 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు