CASE AGAINST PVP FILED BY DAUGHTER OF BJP LEADER DK ARUNA VRY
Hyderabad : పీవిపీ పై మరో దౌర్జ్యన్యం కేసు నమోదు.. డీకే అరుణ కుమార్తె శృతిరెడ్డి ఫిర్యాదు
Hyderabad : పీవిపీ పై మరో కేసు నమోదు.. డీకే అరుణ కుమార్తె ఫిర్యాదు
Hyderabad : ప్రముఖ వ్యాపార వేత్త, వైసీపీ నాయకుడు పొత్తూరి వరప్రసాద్ పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో మరో దౌర్జన్యం కేసు నమోదు అయింది. అది కూడా బీజేపీ నేత డీకే అరుణ కుమార్తే ఆయనపై ఫిర్యాదు చేసింది.
ప్రముఖ వ్యాపారవేత్త ,వైసీపీ నాయకుడు పోట్లూరీ వరప్రసాద్ పై మరోసారి హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణబీజేపీ నేత డీకే అరుణ కుమార్తె తన ఇంటి గోడను ఇతరులతో కలిసి బలవంతంగా కూలగొట్టించారని ఆమె ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7లోని తాను కొనుగోలు చేసిన విల్లాలో డికే అరుణ కుమార్తె శృతి రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి ఆమె స్వంతగా నిర్మించుకున్న ప్రహరి గోడతో పాటు రేకులను సైతం పీవిపీ అనుచరుడు బాలాజీ మరికొందరితో కలిసి జేసీబితో ధ్వంసం చేయించారు. అయితే దీనిపై ప్రశ్నించిన శృతిరెడ్డిని బెదిరింపులకు గురి చేసినట్టు తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పీవిపీతోపాటు సంఘటన స్థలంలో ఉన్న బాలాజీ అతనికి సహకరించిన మరికొందరిపై కేసు నమోదు చేశారు.
కాగా గతంలో పీవిపీ తన రియల్ కంపనీ ద్వారా ప్రేమ్ పర్వత్ విల్లాస్ అనే వెంచర్ వేసి వాటిని అమ్ముకున్నారు. అయితే విల్లాలు కొనుగోలు చేసిన వారు తమకు అనుకూలంగా ఇంటిని మార్చుకుంటుండడంతో ఆయన అడ్డుకుంటున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలా గత రెండు సంవత్సరాల క్రితం కూడా ఓ రినోవేషన్ చేసుకుంటున్న ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంటిని కూలగొట్టినట్టు కేసు నమోదైంది. కాగా ఆ కేసు విచారణకు వెళ్లిన పోలీసులపైకి ఆయన కుక్కల్ని వదలడంతో ఆ కేసు సైతం వివాదస్పదమైంది. దీంతో ఆకేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకోవడంతో కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. తాజాగా అదే తరహాలో కేసు నమోదు కావడం చర్చనీయంశంగా మారింది.
మరోవైపు విల్లాలు అమ్మినప్పుడే వాటిలో ఎలాంటీ మార్పులు చేయకూడదని నిబంధనలు రాసుకున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. అయినా కొంతమంది మార్పులు చేసుకుంటుండడంతో కూలగొడుతున్నట్టు పీవీపికి చెందిన రియల్ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో ఇద్దరు రాజకీయ నేతల మధ్య కేసు కొనసాగుతుండడంతో ఎలాంటీ పరిణామాలు చోటు చేసకుంటాయో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.