Home /News /telangana /

CASE AGAINST NEW MARRIED COUPLE DUE TO BARAATH FUNCTON AT JAGITYALA VRY

Lockdown కష్టాలు : లాక్డౌన్‌లో బరాత్..ఏకంగా వధువరులపై కేసు.

లాక్డౌన్‌లో బరాత్..ఏకంగా వధువరులపై కేసు

లాక్డౌన్‌లో బరాత్..ఏకంగా వధువరులపై కేసు

Lockdown : కరోనా కాలంలో పెళ్లిల్లు పూర్తిగా తన స్థితిని మార్చుకున్నాయి..వేలాది మందితో హంగు ఆర్భాటలతో తమ దర్పం చూపించుకోవాలనే వారికి కరోనా చుక్కలు చూపించడంతో పాటు అనేక చిక్కులను కూడ తెచ్చిపెడుతోంది.

కరోనా కాలంలో పెళ్లిల్లు పూర్తిగా తన స్థితిని మార్చుకున్నాయి..వేలాది మందితో హంగు ఆర్భాటలతో తమ దర్పం చూపించుకోవాలనే వారికి కరోనా చుక్కలు చూపించడంతో పాటు అనేక చిక్కులను కూడ తెచ్చిపెడుతోంది.

పెళ్లిళ్లలకు కరోనా శరాఘాతం అవుతోంది..కరోనాతో ఇప్పటికే సంవత్సర కాలాన్ని వృధా చేసుకున్న వధువరులు..కనీసం ఈ సంవత్సరమైనా ఎంజాయ్ చేద్దామంటే మరోసారి కరోనా విరుచుకుపడుతోంది..కరోనాతో ఏ పని అనుకున్న విధంగా చేసుకోలేని పరిస్థితి..కనీసం ఊళ్లో ఉన్న బంధువులను స్నేహితులను పిలుచుకుని పెళ్లి చేసుకుందామనే ఆలోచనకు అసలు రూపమే లేకుండా పోతుంది..దీంతో కేవలం కుటుంబ సభ్యులతోనే పెళ్లి తంతును ముగిస్తున్నవారు అనేక మంది ఉన్నారు. పెళ్లి అలా.. జీవితంలో గుర్తుండిపోయో విధంగా అట్టహాసంగా చేసుకోవాలనుకునే వాళ్లకు కరోనా నిబంధనలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి..ఇదంతా ప్రజల మంచికోసమే అయినా..పెళ్లి చేసుకోవాలనుకునే వారికి మాత్రం చాల కష్టాలను తెచ్చిపెడుతుంది..

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలోనే పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా హద్దులు మీరిన వారికి చుక్కలు చూపిస్తున్నారు..పెళ్లికి కేవలం వందమందికే అనుమతి ఇచ్చినా...పెళ్లి మంటపాల్లోకి వెళ్లి మరి చెక్ జేస్తున్నారు..అడుగడుగునా నిబంధనలతో పెళ్లిళ్ల పేరయ్యలకు అనేక కష్టాలు వచ్చి పడ్డాయి..అయితే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కొరఢా ఝలిపించడంతో పాటు కేసులు కూడ పెడుతున్నారు..పెళ్లికి పిలిచిన వారు ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా... వధువరులకే శిక్షలు వేస్తున్నారు..

ఇలా తాజాగా తెలంగాణలో పోలీసులు ఇదే చర్యను తీసుకున్నారు... పెళ్లికి అనుమతి ఉన్నా... డాన్సులు, హంగామాలకు అనుమతి లేదు... అయితే కొంతమంది పోలీసుల కళ్లుగప్పి ధూంధాంలను నిర్వహిస్తున్నారు.అయితే ఇలా పోలీసులు కళ్లు గప్పి పెళ్లి బరాత్ నిర్వహిస్తున్నా.జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడి పెళ్లి శనివారం జరిగింది..దీంతో రాత్రి బరాత్ నిర్వహించారు. బరాత్ ‌లో విచ్చలవిడిగా మద్యం సేవించి, మాస్క్‌లు లేకుండా డాన్స్‌లు చేశారు..దీంతో పోలీసులు ఏకంగా ఇందుకు కారణమైన వధువరులతో పాటు మరో ముగ్గురుపై కూడ కేసు నమోదు చేశారు.
Published by:yveerash yveerash
First published:

Tags: Lockdown, Marriage, Police

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు