కేసీఆర్‌ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు... మీడియా సంస్థపై కేసు

సీఎం కేసీఆర్ జలుబు తదితర లక్షణాలతో బాధపడుతున్నారని, క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారని.. ప్రగతి భవన్‌లో 30 మందికి కరోనా అంటూ వచ్చిన వార్తపై టీఆర్ఎస్ కార్యకర్త ఇలియాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: July 6, 2020, 3:09 PM IST
కేసీఆర్‌ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు... మీడియా సంస్థపై కేసు
తెలంగాణ సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రచురించిన ఆదాబ్ హైదరాబాద్ మీడియా సంస్థపై కేసు నమోదైంది. సంస్థకు చెందిన విలేకరితో పాటు పత్రిక యాజమాన్యంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఎం కేసీఆర్ జలుబు తదితర లక్షణాలతో బాధపడుతున్నారని, క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారని.. ప్రగతి భవన్‌లో 30 మందికి కరోనా అంటూ వార్తపై టీఆర్ఎస్ కార్యకర్త ఇలియాస్ ఆరా తీశారు. సీఎం కేసీఆర్‌పై కేసీఆర్‌పై తప్పుడు ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో ఆందోళన కలిగించే కుట్రకు పాల్పడిన ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఎడిటర్, యాజమాన్యం పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఇలియాస్ జూజ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆదాబ్ హైదరాబాద్ పత్రిక విలేఖరితో పాటు యాజమాన్యంపై ఐపీసీ 505(1)(b), 505(2) రెడ్ విత్34 సెక్టన్లతో పాటు 54 ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




Published by: Kishore Akkaladevi
First published: July 6, 2020, 3:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading