CARS RAMS INTO AGRICULTURAL WELL IN KARIMNAGAR 4 PERSONS MISSING RESCUE OPERATION CONTINUES SK
Karimnagar: ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లి మునిగిపోయిన కారు.. నలుగురు గల్లంతు..
ఘటనా స్థలంలో సహాయక చర్యలు
బావి లోపల 25 అడుగుల లోతులో కారు ఉన్నట్లుగా రెస్క్యూ సిబ్బంది భావిస్తున్నారు. కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారని.. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కరీంనగర్లో ఘోర ప్రమాదం జరిగింది. అతి వేగంతో అదుపు తప్పిన ఓ కారు వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. చుట్టుపక్కల ఉన్నవారు వచ్చే లోపే అది పూర్తిగా నీట మునిగింది. బావి అట్టడుగుకు వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు గల్లలంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బావి లోపల 25 అడుగుల లోతులో కారు ఉన్నట్లుగా రెస్క్యూ సిబ్బంది భావిస్తున్నారు. కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారని.. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఐతే కారులో ఉన్న వారు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అనే వివరాలు తెలియాల్సి ఉంది.
కారును పైకి తీసుకొచ్చేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కారుకు ఐరన్ తాడును కట్టి క్రేన్‌తో పైకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకు మూడు సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. కారు కొంత దూరం వరకు పైకి వచ్చి మళ్లీ నీటిలో పడిపోయింది. ఇప్పటికే గజఈతగాళ్లను కూడా రప్పించారు. తాడుకు కొక్కెం కట్టి.. దాన్ని కారుకు తగిలించి.. పైకి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపు 3 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరో గంట సేపట్లో కారును పైకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు. అప్పటికీ సాధ్యం కాకపోతే.. సింగరేణి నుంచి నిపుణులను రప్పించాలని భావిస్తున్నారు. ఐతే కారు పూర్తిగా బావి అడుగుకు వెళ్లిపోవడంతో.. అందులో ఉన్న వారు బతికే అవకాశాలు చాలా తక్కువ అని అభిప్రాయపడుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.