వాగు దాటే క్రమంలో వరద నీటి ప్రవాహానికి కారు గల్లంతు.. నలుగురు యువకులు

ప్రతీకాత్మక చిత్రం

బోనకల్లు మండలం రాపల్లి నుంచి చిన్నబీవరల్లి వైపు ఓ కారులో నలుగురు యువకులు ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యలో ఓ వాగుపై చిన్నపాటి బ్రిడ్డి ఉంది. శుక్రవారం రాత్రి కురిసి వర్షానికి ఆ వాగు ఉప్పొంగింది.

  • Share this:
    వర్షంకాలం మొదలయ్యింది. వరద నీటి ప్రవాహానికి వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. వాస్తవానికి నీరు పైకి చూసేందుకు చాలా ప్రశాంతంగా కన్పిస్తుంది. కానీ అది సృష్టించే భయోత్పాతం అంతాఇంతా కాదు. ఎంత మంచి నిపుణుడైనా ఒక్కోసారి వరద నీటిని అంచనా వేయడంలో తలకిందులవుతుంటారు. ఈ క్రమంలో ప్రతిసారి వర్షాకాలంలో ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉంటున్నాయి. వరద నీటి ప్రవాహాంలో కొట్టుకుపోయి గల్లంతైన వారు వేల సంఖ్యలోనే ఉన్నారు. తాజాగా ఖమ్మంజిల్లాలో ఇదే తరహా ఘటన ఒకటి చోటుచేసుకుంది. వాగు వరద ఉధృతిని అంచనా వేయడంలో ఓ కారు డ్రైవర్ తప్పడంలో కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రాపల్లి నుంచి చిన్నబీవరల్లి వైపు ఓ కారులో నలుగురు యువకులు ప్రయాణిస్తున్నారు.

    మార్గమధ్యలో ఓ వాగుపై చిన్నపాటి బ్రిడ్డి ఉంది. శుక్రవారం రాత్రి కురిసి వర్షానికి వాగు ఉప్పొంగింది. వాగును దాటే క్రమంలో వరద నీటి ప్రవాహం అడ్డు వచ్చింది. అయితే కారును నడిపే డ్రైవరు వరద నీటి ప్రవాహాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. దీంతో వాగును దాటించే క్రమంలో కారు వరద నీటి ఉధృతికి ఆగలేక వాగులో పడి కొట్టుకుపోయింది. వెంటనే గమనించిన స్థానికులు ఆ కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులను అతికష్టం మీద సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో యువకులు బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డారు.
    Published by:Narsimha Badhini
    First published: