news18-telugu
Updated: November 10, 2020, 9:15 AM IST
ప్రతీకాత్మక చిత్రం
Road Accident: అది తెలంగాణ... సంగారెడ్డి జిల్లా... పటాన్చెరు మండలం... ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ (ORR)... పాటి గ్రామానికి దగ్గర్లో... అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. జైలో వాహనాన్ని మరో గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్పెంటర్లు చనిపోయారు. వాళ్లంతా జార్ఖండ్‌కు చెందిన వారని తెలిసింది. మొత్తం 10 మంది వాహనంలో ప్రయాణిస్తుండగా... ఈ ప్రమాదం జరిగింది. లక్కీగా నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. గచ్చిబౌలి నుంచి జార్ఖండ్ వెళ్తుండగా... ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిస్తున్నారు. ఢీ కొట్టిన వాహనం ఏదన్నది తెలుసుకునేందుకు సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
కరోనా లాక్డౌన్ ఎత్తివేశాక... రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బైకులు, కార్ల ప్రమాదాలు పెరిగాయి. అందుకే అతి వేగం వద్దు అని ట్రాఫిక్ పోలీసులు తరచూ చెబుతూనే ఉన్నారు. అయినా... కొంత మంది వేగంగా నడిపేస్తూ ఇలా తమ ప్రాణాలతోపాటూ... ఇతరుల ప్రాణాలూ తీస్తున్నారు. ముఖ్యంగా ఔటర్ రింగు రోడ్డుపై వాహనాలు చాలా వేగంగా వెళ్తున్నాయి. సడెన్ బ్రేక్ వేసేటప్పటికే... టైర్లు స్లిప్పై జరుగుతున్న ప్రమాదాలు చాలా ఉన్నాయి. తాజా దుర్ఘటనలో అసలేం జరిగిందో స్పష్టంగా తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Published by:
Krishna Kumar N
First published:
November 10, 2020, 6:17 AM IST