తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం (Siddipet Road Accident) జరిగింది. అతివేగంతో అదుపుతప్పిన ఓ కారు బావిలోకి (Car rams into well) దూసుకెళ్లింది. అందులో ఉన్న ఇద్దరు ప్రయణికులు నీట మునిగి మరణించారు. ఐతే ఆ కారును బయటు తీసే క్రమంలో ఓ గజ ఈతగాడు కూడా మరణించడు. దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో బుధవారం ఈ ఘటన చోటచేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం దుబ్బాక మండలం చిట్టాపూర్ వద్ద ఓ కారు బావిలో పడింది. టైరు పేలడంతో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు ప్రారంభించారు. గజ ఈతగాళ్ల సాయంతో కారును బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దాదాపు 6 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగాయి.
అసలైన తెలంగాణ ఇంకా రాలేదు.. మరో పోరాటానికి సిద్దం : Etela Rajender సంచలన వ్యాఖ్యలు
బావి నిండా నీళ్లు ఉండడంతో కారును బయటకు తీయడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో రెండు మోటార్ల సాయంతో బావిలోని నీటిని ఖాళీ చేసేందుకు ప్రయత్నించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఘటనా స్థలికి చేరుకొని స్వయంగా సహాయ చర్యలను పరిశీలించారు. బావిలో నుంచి కారును బయటకు తీసేందుకు గజఈతగాళ్లు తీవ్రంగా శ్రమించారు. బావిలో సగం వరకు నీళ్లను ఖాళీ చేసిన తర్వాత.. నర్సింహులు అనే గజ ఈతగాడు కారుకు తాడును బిగించాడు. ఆ తర్వాత కారుతో పాటు పైకి వచ్చే క్రమంలో.. అతడు కారు ముందు చక్రం భాగంలో చిక్కుకుపోయాడు. తాడు కూడా చుట్టుకోవడంతో బయటకు రాలేకపోయాడు. అందరూ చూస్తుండగానే నీటిలోనే కన్నుమూశాడు నర్సింహులు.
trs ఎంపీలపై స్పీకర్ ఆగ్రహం -cm kcr చెప్పినట్లే ఢిల్లీలో గులాబీ రభస
ఒడ్డున ఉన్న మిగతా సిబ్బంది తాడును లాగి కారు పైకి తీసుకొచ్చారు. కారుతో పాటే నర్సింహులు మృతదేహం కూడా పైకి వచ్చింది. ఇక కారులో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామ గ్రామానికి చెందిన లక్ష్మీ, ప్రశాంత్‌గా గుర్తించారు. వీరిద్దు తల్లీకొడుకులు. దుబ్బాక నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో కారు టైర్ పేలిపోయింది. అనంతరం నేరుగా బావిలోకి వెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కారును బయటకు తీసే క్రమంలో గజఈతగాడు నర్సింహులు కూడా మరణించడంతో అందరూ కంటతడిపెట్టారు. వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Road accident, Siddipet, Telangana