CAR FELL DOWN IN CANAL IN KHAMMAM DISTRICT AND NEWLY MARRIED WOMAN FOUND DEAD IN VIKARABAD DISTRICT KHM SSR
Car Accidents: ఖమ్మం జిల్లాలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. నవ వధువు చనిపోవడంతో వికారాబాద్ జిల్లాలో విషాదం
కారు ప్రమాద దృశ్యాలు, పక్కనే తిమ్మాపూర్ కారు ప్రమాద దృశ్యాలు
తెలుగు రాష్ట్రాల్లో గత రెండుమూడు రోజులుగా రోడ్డు ప్రమాదాలు మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. తాజాగా.. ఖమ్మం జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. విజయవాడ కనక దుర్గమ్మ తల్లి దర్శనానికి వెళుతుండగా ఓ కారు అదుపు తప్పి వాగులో పడిపోయింది. అయితే.. వెంటనే రోడ్డుపై వెళుతున్న ద్విచక్రవాహనదారులు గమనించి కారులో ఉన్నవారిని సకాలంలో స్పందించి కాపాడటంతో ప్రమాదం తప్పింది.
ఖమ్మం, వికారాబాద్: తెలుగు రాష్ట్రాల్లో గత రెండుమూడు రోజులుగా రోడ్డు ప్రమాదాలు మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. తాజాగా.. ఖమ్మం జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. విజయవాడ(Vijayawada) కనక దుర్గమ్మ తల్లి దర్శనానికి వెళుతుండగా ఓ కారు అదుపు తప్పి వాగులో పడిపోయింది. అయితే.. వెంటనే రోడ్డుపై వెళుతున్న ద్విచక్రవాహనదారులు గమనించి కారులో ఉన్నవారిని సకాలంలో స్పందించి కాపాడటంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే... ఖమ్మం(Khammam) నగరానికి చెందిన శ్రీనివాస్ రావు కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి కారులో వెళుతున్నారు. బయలుదేరిన కొద్దిసేపటికే ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాధపురం గ్రామం వద్ద తుమ్మలమ్మ వాగులో వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పడిపోయింది. పల్టీలు కొట్టి ఒక పక్కకు పడిపోయింది. ఇది గమనించిన ద్విచక్ర వాహన దారులు అప్రమత్తమై కార్లో ప్రయాణిస్తున్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అందరూ సురక్షితంగా బయట పడటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. కారు నెమ్మదిగా వెళుతున్న సమయంలో ప్రమాదం జరగడంతో స్వల్ప గాయాలతో అందరూ బయటపడ్డారు. వాగులో నీళ్లు ప్రవహిస్తుండటంతో కారు తీయడం కష్టంగా మారింది.
ఇదిలా ఉంటే.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగులో గల్లంతైన కారు ఆచూకీ లభ్యమైంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆ కారు తిమ్మాపూర్ వాగు ఉధృతికి కొట్టుకుపోయింది. వాగుకు కిలోమీటరు దూరంలో కారును పోలీసులు గుర్తించారు. రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. చనిపోయిన వారిలో నవవధువు కూడా ఉన్నట్లు గుర్తించారు. పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టాల్సిన నవ వధువు.. కాళ్ల పారాణి ఆరక ముందే ఇలా ప్రమాదవశాత్తూ చనిపోవడం ఇరు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన బాల్‌రెడ్డి కొడుకు నవాజ్‌రెడ్డికి.. మోమిన్‌పేటకు చెందిన ప్రవళికకు శుక్రవారం వివాహం జరిగింది. పెళ్లి తంతు పూర్తి చేసుకుని మోమిన్‌పేట నుంచి ఈ కొత్త జంట.. బంధువులతో కలిసి రావులపల్లికి బయల్దేరింది. అప్పటికే.. తిమ్మాపూర్ దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రావులపల్లి వెళ్లాలంటే ఆ వాగు దాటాల్సి ఉంది. వాగు ఉధృతంగా ప్రవహిస్తోందని.. వెళ్లడం శ్రేయస్కరం కాదని చెప్పినా డ్రైవర్ వినిపించుకోలేదు. అలా నీళ్ల మధ్యలోకి వెళ్లగానే ఆ ప్రవాహ ఉధృతికి కారు కొట్టుకుపోయింది. ఆ కారులో ఉన్న వారిలో వరుడు నవాజ్ రెడ్డి, అక్క రాధమ్మ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వారు గల్లంతయ్యారు. పెళ్లి కూతురితో పాటు ముగ్గురు ఆచూకీ కోసం పోలీసులు గాలించారు. పెళ్లి కుమార్తెతో పాటు మరొకరు కూడా చనిపోయినట్లు తాజా సమాచారం. మిగిలిన ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.