హైదరాబాద్‌లోని బంజారహిల్స్‌లో తీవ్ర కలకలం రేగింది. రోడ్డుపై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును రోడ్డు పక్కకు ఆపేసి ప్రయాణికులను కిందకు దింపాడు. అనంతరం తానూ బయటపడ్డాడు. ఆ తర్వాత నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే కారు కాలిపోయింది. అగ్నిమాపకశాఖ సిబ్బంది వచ్చి మంటలు అదుపుచేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో బంజార హిల్స్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామైంది.
వీడియో ఇక్కడ చూడండి:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.