Home /News /telangana /

CAR ACCIDENT TOOK PLACE ON DURGAM CHERUVU CABLE BRIDGE OF HYDERABAD AK

Durgam Cheruvu Cable Bridge: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కారు బోల్తా

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై బోల్తా కొట్టిన కారు

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై బోల్తా కొట్టిన కారు

Car Accident: ప్రమాదం జరిగిన సమయంలో వాహనాల రద్దీ పెద్దగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

    హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిపై కారు బోల్తా కొట్టింది. కేబుల్‌ బ్రిడ్జిపై వెళ్తున్న కారు టైర్‌ బ్లాస్ట్‌ కావడంతో ఈ ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కారులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ గోడను ఢీకొట్టింది. దీంతో కారు టైరు పేలిపోయింది. దీంతో కారు పూర్తిగా బోల్తా కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనాల రద్దీ పెద్దగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు.

    ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు .. బోల్తా పడిన కారును ట్రాఫిక్ పోలీసులు సహాయంతో అక్కడ నుంచి తరలించారు. ఇక దేశంలోనే అతిపెద్ద కేబుల్‌ బ్రిడ్జిగా గుర్తింపు తెచ్చుకున్న దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిని సెప్టెంబర్‌లో ప్రభుత్వం ప్రారంభించింది. సెప్టెంబర్‌ 25న మంత్రి కేటీఆర్‌ ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. కేబుల్ బ్రిడ్జి కావడం... రాత్రి సమయంలో లైట్లతో ఎంతో ఆకర్షణీయంగా ఉండటంతో.. ఈ బ్రిడ్జి చాలామందికి ఒక పర్యాటక కేంద్రంగా మారింది.

    చాలామంది ఇక్కడికి వచ్చి సమయం గడిపేందుకు ఆసక్తి చూపించారు. ఫోటోలకు యువతతో పాటు పెద్దలూ పోటీపడుతున్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. సెల్ఫీల కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని.. కాబట్టి బ్రిడ్జిపైకి వచ్చే వాళ్లు అనేక జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. అయితే తాజాగా కారు బోల్తా ఘటనతో... బ్రిడ్జిపై మరిన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Car accident, Telangana

    తదుపరి వార్తలు