(కట్ట లెనిన్, న్యూస్ 18, ఆదిలాబాద్ జిల్లా)
ఎన్నికల్లో పోటి చేయడానికి తమకు ఓటు స్థానికంగా లేకపోయిన పోటి చేసే వెసులుబాటు ఉంటుంది. దీంతో చాలామంది నేతలు తాము పోటి చేసే ప్రాంతాల్లో తమ ఓటును తాము వేసుకోలేక పోయినా ఎన్నికల్లో గెలుస్తారు.. ( Telangana mlc elections ) ఇలా తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆదిలాబాద్ జిల్లాలో పోటి చేసిన ఇద్దరు సభ్యులు కూడా తమ ఓటు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది.
సాధారణ ఎన్నికలకు భిన్నంగా సాగిన శాసన మండలి ఎన్నికలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడి స్థానానికి జరిగిన ఎన్నికలో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు ఓటు వేయలేదు. వీరితోపాటు అధికార పార్టీకి చెందిన ఓ శాసన సభ్యుడు కూడా ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.
ఇందుకు కారణం... ఉమ్మడి ఆదిలాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడి స్థానానికి అధికార టిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి దండె విఠల్, స్వతంత్ర అభ్యర్థిగా తుడుందెబ్బ నాయకురాలు పెందూర్ పుష్పారాణి బరిలో నిలిచారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఈ సారి పోటికి దూరంగా ఉన్నాయి. ( Telangana mlc elections )కాగా ఉమ్మడి జిల్లాలో 937 మంది ఓటర్లు ఉండగా జిల్లా వ్యాప్తంగా ఎనిమిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 308 మున్సిపల్ కౌన్సిలర్లు, 65 మంది జడ్ పిటిసి సభ్యులు, 554 మండి ఎంపిటిసి సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులు పది మంది ఉన్నారు. పోలింగ్ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, ఉట్నూరు, నిర్మల్ జిల్లాలో నిర్మల్, భైంసా, మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్ నగర్ లలో కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Hyderabad : అక్రమ నిర్మాణాలపై మరోసారి ఫోకస్.. 30లోగా గుర్తించి కూల్చి వేయండి...ప్రభుత్వ ఆదేశాలు.
అయితే ఈ ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడు, శాసనసభ్యులు, జడ్ పిటిసి, ఎంపిటిసి సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ( Telangana mlc elections )అయితే ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు ఎన్నికల కమీషన్ నిర్దేశిత జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీల్లో సభ్యత్వం కలిగి లేరు. దీంతో వీరికి ఈ ఎన్నికల్లో ఓటు హక్కు లభించలేదు.
ఇదిలా ఉంటే ఎక్స్ అఫిషియో సభ్యులు తమ నియోజకవర్గ లోని మున్సిపాలిటీల్లో మాత్రమే ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే బోథ్ శాసన సభ నియోజకవర్గంలో మున్సిపాలిటి లేకపోవడంతో బోథ్ శాసన సభ్యుడు రాథోడ్ బాపురావు పేరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో చేర్చలేదు. ( Telangana mlc elections )దీంతో ఈ ఎన్నికల్లో ఆ ఎమ్మెల్సీ ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. కాగా పిడి యాక్ట్ కింద అరెస్టయి చంచల్ గూడ జైలులో ఉన్న ఇద్దరికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా అవకాశం కల్పించారు.
Army man missing : ఇంటి నుండి... ఉద్యోగానికి వెళ్లిన ఆర్మీ జవాన్ మిస్సింగ్..
ముందుగా వారు పెట్టుకున్న విజ్ఞప్తి మేరకు ఎన్నికల నిబంధనలనుసరించి అధికారులు వారికి పోస్టల్ బ్యాలెట్ పంపించారు. ( Telangana mlc elections )ఇగ నిరక్ష్యరాస్యత కారణంగా 32 మంది ఓటర్లు తమకు సహాయకులను కెటాయించాలని కెటాయించాలని జిల్లా ఎన్నికల అధికారికి విన్నవించుకోవడంతో వారికి అవకాశం కల్పిస్తూ సహాయ ఎన్నికల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంమీద ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలకు భిన్నంగా జరిగినప్పటికి ప్రశాంతంగా జరిగాయి.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Mlc elections