హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో (Huzurabad By elctions )అధిక నామినేషన్లు వేసి రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇవ్వాలనుకుంటున్న నిరుద్యోగులతో పాటు ఇతర వర్గాల వారికి ఎన్నికల కమిషన్ అధికారులు కోవిడ్ నిబంధనల పేరుతో చుక్కలు చూపిస్తున్నారు. దీంతో అభ్యర్థులు (Candidates ) నామినేషన్ వేయకుండానే వెనుదిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే చాలా మంది అభ్యర్థులు తమ నామినేషన్ (nominations ) వేయకుండానే అసహనంగా వెనుదిరిగేటట్టుగా పరిస్థితులను కల్పించే విధంగా స్థానిక పోలీసులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వేసి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనుకుంటున్న వారికి కోవిడ్ నిబంధనలు అడ్డుగా మారుతున్నాయి. దీంతో పాటు స్థానిక పోలీసులు అధికారులు సైతం నామినేషన్లు ఎక్కువ సంఖ్యలో పడకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల పేరుతో అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు సమాచారం.
ఇది చదవండి : ఆడబిడ్డ కళ్లకు గంతలు కట్టి.. ఆడుకుందామంటూ దారుణానికి దిగిన వదినా... !
ఈ క్రమంలోనే మంగళవారం నామినేషన్ వేయడానికి వెళుతున్న అభ్యర్థులను కోవిడ్ టీకా సర్టిఫికెట్స్ (covid certificates ) లేవనే నిబంధనతో పోలీసులు ముందుగానే అడ్డుకున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున నామినేషన్ వేయాలని నిర్ణయించిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్‌ను అడ్డుకునేందుకు కూడా పోలీసులు మోహరించారు. దీంతో నిబంధనలు పాటించడం లేదంటూ నిన్న కొద్ది మంది ఫీల్డ్ అసిస్టెంట్స్‌ను కూడ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే..
ఇలా నామినేషన్ వేసేందుకు వెళుతున్న 16 మంది అభ్యర్థులను వెనక్కి పంపారు. మొత్తం పదహారు మందిలో 6 అభ్యర్ధులకు సైతం కరోనా టీకా సర్టిఫికెట్ లేదని వెనక్కి పంపగా మరో పదిమందికి మాత్రం వారిని బలపరిచే వారికి కూడా కరోనా టీకా సర్టిఫికెట్ లేదంటూ వెనక్కి పంపారు. దీంతో ఆ పదిమంది కూడా నామినేషన్ వేయకుండానే వెనక్కి వెళ్లిపోయారు. దీంతోపాటు కనీసం నామినేషన్ పత్రాలను కూడా ఇవ్వడానికి నిరాకరించారు. పత్రాల పేరుతో గంటల తరబడి వేయిట్ చేయించి చివరకు ఫామ్స్ ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్ నుండే డౌన్‌లోడ్ చేసుకోవాలని పంపించారు. ఇలా అనేక నిబంధనలతో పాటు అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేయడంతో అధికారులతో వాగ్వావాదానికి దిగారు.
ఇది చదవండి : హుజూరాబాద్‌లో హోరెత్తనున్న ప్రచారం.. ఇదిగో ప్రచారాన్ని నిర్వహించేది వీరే.. !
మొత్తం మీద నామినేషన్లు ఎక్కువ సంఖ్యలో వేయకుండా దీనివెనక వ్యుహం ఉందని అభ్యర్థులు భావిస్తున్నారు. కాగా నిజామాబాద్ ఉప ఎన్నికల్లో భారీ ఎత్తున పసుపు రైతులు నామినేషన్ వేసి అధికార పార్టీకి ఇబ్బందులు తలెత్తడంతో ప్రస్తుతం అలాంటి పరిణామాల నుండి బయటపడేందుకు అధికార టీఆర్ఎస్ వ్యుహాలు రిచిస్తుందని పలువురు అభ్యర్థులు ఫైర్ అవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Election Commission of India, Huzurabad By-election 2021, Karimnagar