హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: కరోనా పాజిటివ్ వచ్చిన తల్లి శిశువుకు పాలు ఇవ్వొచ్చా..! ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..

Telangana: కరోనా పాజిటివ్ వచ్చిన తల్లి శిశువుకు పాలు ఇవ్వొచ్చా..! ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: కరోనా పాజిటివ్ వచ్చిన మహిళలు తమ బిడ్డలకు పాలు ఇవ్వొచ్చా.. లేదా అనేది చాలా మందికి సదేహంగా ఉంటుంది. ఒకవేల పాలు ఇస్తే అటువంటి సమయంలో తల్లి ఎలాంటి జగ్రత్తలు తీసుకోవాలి.. శిశువుకు కరోనా లక్షణాలు ఉంటే ఏ మందులు వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఎవరినీ వదిలేటట్టు లేదు. ప్రతీ ఒక్కరికీ అంటుకుంటుంది. సామాన్యుడి దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు మహమ్మారి బారిన పడుతున్నారు. అయితే సాధారణ ప్రజలకు వస్తే డాక్టర్స్ కొన్ని మందులు వాడి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా పోతుందని సలహా ఇస్తుంటారు. కానీ అప్పడే శిశువుకు జన్మనిచ్చిన తల్లి బిడ్డకు పాలు ఇవ్వొచ్చా లేదా అనేది తెలియదు. కానీ పాజిటివ్ వచ్చిన తల్లి శిశువుకు పాలు ఇవ్వొచ్చు. కాకపోతే పాలు ఇచ్చే సమయంలో రెండు మాస్క్ లు ధరించాలని  మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రముఖ చిన్న పిల్లల డాక్టర్‌ రాఘవేంద్రకుమార్‌ తెలిపారు. ప్రతీ సారి శిశువును దగ్గరకు తీసుకోకూడదని.. మిగతా సమయంలో వేరే వాళ్లకు ఇవ్వాలన్నారు. శిశువుకు లక్షణాలు ఉంటే కావాల్సిన మందులు వాడాలి. పరీక్షలు మాత్రం చేయించాల్సిన అవసరం లేదని తెలిపారు. మొదటి వేవ్ కరోనా కంటే సెకండ్ వేవ్ కరోనా వ్యాప్తి వేగంగా ఉంది. అందులో కూడా 4 శాతం వరకు చిన్నారులకు కూడా సోకుతోంది. కానీ అది తీవ్ర సమస్యకు గురికాకుండా స్వల్ఫ లక్షణాలతో రికవరీ అవుతున్నారు.

చిన్నారుల్లో ప్రదానంగా జ్వరం, దగ్గు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తులకు సంబంధించిన లక్షణం మాత్రం చిన్నారుల్లో కనిపించడం లేదని తెలిపారు. జ్వరం వచ్చి రెండు మూడు రోజుల దాకా నయం కాకపోతే పారీసిటమాల్ ప్రతి ఆరు గంటలకు ఒకసారి వేయాలన్నారు. అప్పడే పాపకు జన్మనిచ్చే తల్లికి పాజిటివ్ ఉండి శిశువుకు నెగెటివ్ ఉంటే నిర్లక్ష్యం చేయవద్దన్నారు.

Benefits of Breastfeeding, breast feeding, breast feeding week, benefits of breast feeding, తల్లిపాలు, తల్లి పాలు ఆహారం
ప్రతీకాత్మక చిత్రం

world breastfeeding week,breastfeeding,breastfeeding week,world breastfeeding week 2019,world breastfeeding week,theme of world breastfeeding week 2019,breastfeeding awareness,world breastfeeding week 2019,world breastfeeding week posters,world breastfeeding week drawing,themes of world breastfeeding week,drawing on world breastfeeding week,drawing for world breastfeeding week,తల్లిపాల వారోత్సవాలు,తల్లి పాలు,తల్లి బిడ్డ,బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల ప్రయోజనాలు,
ప్రతీకాత్మక చిత్రం

ఆ లక్షణాలు మళ్లీ రెండు మూడు రోజుల తర్వాత బయట పడతాయన్నారు. వారిలో ఉండే టీకా, రోగనిరోధక శక్తివల్ల లక్షణాలు బయటపడటానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. మాస్క్ లు కూడా మూడెళ్లు పైబడిన పిల్లలు మాత్రమే ధరించాలని.. 3 సంవత్సరాల లోపు పిల్లలు ధరించాల్సిన అవసరం లేదని తెలిపారు.

First published:

Tags: Breastfeeding, Corona positive, Covid-19, Infertility, Mother milk, Womens

ఉత్తమ కథలు