Home /News /telangana /

CAMP POLITICS ARE STARTED IN KARIMNAGAR FOR MLC ELECTIONS VRY KNR

Karimnagar : ఎమ్మెల్సీ క్యాంపు రాజకీయాలు షురూ.. నామినేషన్ల నుండే క్యాంపులకు ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Karimnagar : ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ అయిన వెంటనే క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి.. ప్రస్తుత రాజకీయ పరిణాలతో తమ అభ్యర్థులకు కాపాడుకునేందుకు ఏకంగా అధికార పార్టీ క్యాంపు రాజకీయాలను షురూ చేసింది.

    ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగియడంతోనే క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలోనే పలు జిల్లాల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా మరి కొన్ని జిల్లాల్లో నేడు మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ ప్రక్రియ పూర్తి కానుండడతో ఎన్నికల ప్రలోభాలకు తెరలేచింది. దీంతో నామినేషన్స్ వేసిన అభ్యర్థులు అప్పుడే క్యాంపు రాజకీయాలకు తెరతీశారు.

    ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన ఎల్ రమణతో పాటు భాను ప్రసాద్ రావులు నామినేషన్లు ధాఖలు చేశారు..అయితే ఇటివల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే అధికార పార్టీ అలర్ట్ అయింది. దీంతో నామినేషన్ ప్రక్రియ పూర్తైన వెంటనే జిల్లాలో ఉన్న రెండు స్థానాలను కైవసం చేసుకునేందుకు ఆపార్టీ పావులు కదుపుతోంది.

    ఇది చదవండి  : కారు నుజ్జు,నుజ్జు ఇద్దరు యువకుల మృతి..


    ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలంతా ఇప్పటికే.. తమకు సరైన నిధులు , ప్రాతినిధ్యం , ప్రాధాన్యం దక్కడం లేదని ఎంపీటీసీలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే వారిని బుజ్జగించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందుకోసం జిల్లా ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీలు , జెడ్పీటీసీలు , కార్పొరేటర్లు , కౌన్సిలర్లతో సమావేశాలు నిర్వహించారు. కాగా కొంతమంది పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్లు వేసేందుకు సిద్దమయిన నేపథ్యంలోనే వారిని అడ్డుకునే పనిలో పడ్డారు..నామినేషన్ల ప్రక్రియకు ముందే నామినేషన్లు వేయకుండా బుజ్జగింపు రాజకీయాలు చేశారు.

    ఇదంతా ఒకవైపు కొనసాగుతుండగా మరోవైపు ఉమ్మడి జిల్లా నేతలందరూ మంగళవారం ఉదయం 10 గంటల కల్లా కరీంనగర్ పట్టణంలో అందుబాటులో ఉండాలని టీఆర్ఎస్ పార్టీ పెద్దలు సూచించారు. మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మొదటి నాలుగు రోజులు హైదరాబాద్ పరిసరాల్లో క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది . ఆ తర్వాత వేరే ప్రాంతానికి తరలించి అక్కడ నాలుగు రోజులు అయిన తరువాత మరో చోటకు తరలించేందుకు కూడా స్కెచ్ సిద్ధం చేసినట్టు సమాచారం.

    ఇకపోతే క్యాంపులకు తరలిస్తున్న స్థానిక ఎమ్మెల్సీ ఓటర్లు తమ వెంట మొబైల్స్ తీసుకురాకూడదని సూచిస్తున్నారు . వారి వారి కుటుంబ సభ్యులతో రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఫోన్ లో మాట్లాడించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు . మొత్తం పదిహేను రోజుల పాటు క్యాంపు రాజకీయాలను నడిపి ఆ తర్వాత ఎన్నికల పోలింగ్ జరిగే డిసెంబర్ 9 నేరుగా ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు తీసుకువచ్చే విధంగా ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.

    సో మొత్తం మీద గతంలో చాలా స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికైన అధికార పార్టీకి, ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం కొంత ఫైట్ చేయక తప్పే పరిస్థితి కనిపించడం లేదు.. ఇక స్థానిక సంస్థల్లో బలం లేని బీజేపీ ఇప్పటికే ఎన్నికల్లో పోటి చేయకుండా తప్పుకుంటున్నట్టు ప్రకటించగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం మెదక్‌తోపాటు మరో రెండు చోట్ల పోటి చేసేందుకు సమాయత్తమవుతోంది. దీంతో చాలా జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీకి సీట్లు దక్కనున్న కొంత ఉత్కంఠ మాత్రం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Karimnagar, Telangana, Telangana mlc election

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు