CABINET SUB COMMITTEE TO FACE CORONA NEW VARIANT OMICRON IN TELANGANA VRY
Cabinet meeting : అలర్ట్ ఆన్ ఒమిక్రాన్... పరిణామాలపై కేబినెట్ సబ్ కమిటీ.
సీఎం కేసీఆర్ (ఫైల్)
Cabinet meeting : తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం కొత్త వైరస్ ఒమిక్రాన్ వ్యాప్తిపై అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఈ కొత్త వైరస్ పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని సీఎం కేసిఆర్ కోరారు.
సీఎం కేసిఆర్ అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఈ సంధర్భంలోనే మరోసారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్‌పై దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ( Cabinet sub committee to face omicron ) రాష్ట్ర ఆ వైరస్ వ్యాప్తీ, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ప్రజలను అప్రమత్తం చేసి ఎదుర్కొనేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఈ ఉప సంఘంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్, సబితా ఇంద్రారెడ్డి సబ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు సబ్ కమిటీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
దీంతో పాటు..ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు, రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై మంత్రివర్గంలో చర్చిస్తున్నారు. ప్రజారోగ్యం, వైద్యారోగ్య శాఖ సన్నద్ధత కార్యాచరణపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ టీకాల పురోగతి, మందుల లభ్యత, ఆక్సిజన్ పడకల సామర్థ్యం, తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. ( Cabinet sub committee to face omicron ) కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వార్తల నేపథ్యంలో కార్యాచరణ, సన్నద్ధతపై వైద్యారోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.వివిధ దేశాల్లో ఒమిక్రాన్ పరిస్థితిపై వైద్య అధికారులు మంత్రివర్గానికి వివరించారు. దీన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పూర్తి సన్నద్ధతతో ఉందని తెలిపారు. ( Cabinet sub committee to face omicron ) అన్ని మందులు, పరికరాలు, మానవ వనరులు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని వైద్యాధికారులు కేబినెట్‌కు వివరించారు.
దీంతో సీఎం కేసిఆర్ పలు సూచనలు చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని సరిహద్దులోని ఆరు జిల్లాలపై వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ( Cabinet sub committee to face omicron ) వీటిలో ఆదిలాబాద్, కుమరం భీం, నిర్మల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ( Cabinet sub committee to face omicron ) కొవిడ్ పరీక్షలు ఎక్కువగా చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులు, మంత్రులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.