Home /News /telangana /

CABINET SUB COMMITTEE OF DHARANI PORTAL ISSUES MEETING IN SECRETARIAT VRY

Dharni portal : ధరణి పోర్టల్‌లో మరిన్ని మాడ్యూల్... అవగాహన లేకపోవడం వల్లే సమస్యలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dharni portal : ధరణి పోర్టల్ లో ఎదుర్కొన్న పలు సమస్యలను పరిష్కరించుటకు ఇచ్చిన మాడ్యూల్స్ ను , ఆప్షన్స్ పై ధికారులకు అవగాహన నిర్వహించాలని మంత్రి హరీష్ రావు చెప్పారు. దీనిపై సరైన అవగాహాన లేకపోవడం వల్లే సమస్యలు పరిష్కరం కాలేదని ఆయన చెప్పారు.

ఇంకా చదవండి ...
    ధరణి సమస్యలపై ఏర్పడిన మంత్రి వర్గం నేడు సెక్రటేరియట్‌లో సమావేశం అయింది. ఈ సమావేశానికి మంత్రి హరీష్ రావుతో పాటు ఉప సంఘం సభ్యులైన విద్యుత్ శాఖ మంత్రి శ్రీ జి.జగదీశ్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రా రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి,లు పాల్గొన్నారు. అధికారులతో సమావేశమైన కమిటి.. ధరణిలో లోపాలపై చర్చించారు. ఈ సంధర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ధరణి ఆప్షన్స్‌పై అందరికి అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. వీటిపై సరైన అవగాహన లేకపోవడం వల్లే సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయన అన్నారు. ఇందుకోసం జిల్లాపరిషత్ , మున్సిపల్ సమావేశాలకు జిల్లా కలెక్టర్లు హాజరై ధరణి గురించి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా ZPTC, MPPలు, Corporatorలు , కౌన్సిలర్లు, అధికారులకు అవగాహన కల్పించాలని చెప్పారు.

    కాగా భూమి రికార్డుల నిర్వహణలో ధరణి పోర్టల్ మైలురాయిగా నిలుస్తుందని , ఒక సంవత్సర కాలంలోనే 10 లక్షల పైబడి లావాదేవీలు ధరణి ద్వారా జరిగినట్లు చెప్పారు. ధరణి పోర్టల్ లో ఎదురవుతున్న వివిధ రకాల సమస్యలను పరిష్కరించుటకు ధరణి మాడ్యూల్స్ లో చేయాల్సిన మార్పులు , చేర్పులు గురించి ఉపసంఘం సభ్యులు చర్చించారు. భూ రికార్డుల నమోదులో జరిగిన పొరపాట్లను సరిచేసేందుకు అనువైన మాడ్యూల్స్ ను త్వరగా అందుబాటులోకి తేవాలని సూచించారు.. ఇక నిషేధిత జాబితాలో ఉంచిన భూములపై 98.049 దరఖాస్తులు రాగా, వాటిలో 82,472 దరఖాస్తులను డిస్పోజ్ చేసినట్లు అధికారులు వివరించారు.

    ఇది చదవండి : కరీంనగర్‌లో ఇంకా ఆగని ఫైనాన్స్ దందాలు.. అధిక వడ్డీతో దోపిడి..


    రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ టి.హరీశ్ రావు పేర్కొన్నారు. ధరణి పై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం బి.ఆర్.కె.ఆర్. భవన్ లో నిర్వహించిన సమావేశానికి మంత్రి శ్రీ టి.హరీశ్ రావు అధ్యక్షత వహించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షల మేరకు ధరణి పోర్టల్ ను మరింత పరిపుష్టం చేయుటకు పొందుపర్చవలసిన ఆఫ్షన్ లపై చర్చించారు. మంత్రి శ్రీ టి.హరీశ్ రావు కోరారు.



    ధరణి పోర్టల్ లో ఎదుర్కొన్న పలు సమస్యలను పరిష్కరించుటకు అనువైన మాడ్యూల్స్ ను , ఆప్షన్స్ ను పొందుపరచడం జరిగిందని మంత్రి వర్గ ఉపసంఘం అధ్యక్షులు శ్రీ టి.హరీశ్ రావు తెలిపారు. అయితే ఈ మాడ్యూల్స్ పట్ల సరైన అవగాహన లేనందున సమస్యలు పరిష్కారం కావడంలేదని అభిప్రాయపడినారు. ధరణి పోర్టల్ , మాడ్యూల్స్ , ఆప్షన్స్ పై అధికారులు, మీసేవ ఆపరేటర్లకు జిల్లా స్థాయిలో ఒక రోజు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Dharani Portal, Harish Rao, Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు