Home /News /telangana /

Telangana politics : ఆ వర్గానికి కేబినెట్ హోదా.. సీఎం కేసిఆర్ వ్యూహం ఇదేనా...

Telangana politics : ఆ వర్గానికి కేబినెట్ హోదా.. సీఎం కేసిఆర్ వ్యూహం ఇదేనా...

తెలంగాణ సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

తెలంగాణ సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

Telangana cabinet : హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ను దళితులు ఇంకా నమ్మడం లేదా.. అందుకే మరిన్ని ఉన్నత పదవులను కట్టబెట్టేందుకు సీఎం కేసిఆర్ సిద్దమవుతున్నారా..అందుకే రసమయి బాలకృష్ణకు కేబినెట్ హోదాను కల్పించారా..ఇవే కాకుండా ఉపముఖ్యమంత్రి పదవిని కూడా దళితులకు ఇచ్చేందుకు సిద్దమవుతున్నారా..?

ఇంకా చదవండి ...


  హుజూరాబాద్ ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీలో అనేక పరిణామాలకు  కారణమవుతుంది..నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న దళితులను ఆకట్టుకునేందుకు ఆ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ఓటర్లను ఆకర్షించేందుకు అనతి కాలంలోనే దళిత బంధును తీసుకువచ్చి ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయాలు, వారి ఖాతాల్లో వేసే విధంగా స్కెచ్ వేశారు..ఇలా నియోజకవర్గంలోని అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి పదిలక్షల రూపాయలు ఇచ్చేందుకు కార్యచరణ సిద్దమైంది. దాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గంలోనే  సోమవారం సీఎం కేసిఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

  అయితే దళితబంధు పథకం అమలుపై ప్రతిపక్ష పార్టీలతో స్వంత పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలపై ఒత్తిడి పెరుగుతుండడంతో పాటు అది రాష్ట్ర వ్యాప్తంగా అమలు అయ్యె అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి..ఇది నామమాత్రపు చర్యగానే చాలా మంది చూస్తున్నారు. దీని అమలు పై కూడా సీనియర్ మంత్రి కడియం శ్రీహరి నేరుగానే స్పందించారు..దీని అమలును ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందని నొక్కి వ్యాఖ్యానించారు. లేదంటే అది తిరిగి పార్టీపై ప్రభావం చూపుతుందని అన్నారు.. ఈ నేపథ్యంలోనే సొంతపార్టీ నేతల నుండే అసంతృప్తి వ్యక్తం అవుతుండడంతో.. సీఎం కేసిఆర్ మరింత అలర్ట్ అయినట్టు కనిపిస్తోంది..

  మరోసారి దళితులకు ఉపముఖ్యమంత్రి

  ఈ క్రమంలోనే దళితులకు ప్రత్యేక పథకాలతో పాటు రాజకీయంగా కూడా వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే నిర్ణయానికి సీఎం కేసిఆర్ వచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వానికి డిప్యూటి సీఎం గా రాజయ్య తోపాటు కడియం శ్రీహారిలు ఉన్నారు. కాని రెండవ సారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా దళితులను సీఎం కేసిఆర్ విస్మరించారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.

  దళితులకు మరో మంత్రి పదవి

  ప్రస్తుతం ఉప ఎన్నికలో దళితులకు అనుకూలంగా సీఎం కేసిఆర్ నిర్ణయం తీసుకున్నా.. పెద్దగా దళిత వర్గాల నుండి ఆయనకు మద్దతు వస్తున్న పరిస్థితి మాత్రం కనిపించడం లేదని పార్టీ నేతల అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే రాజకీయ పరంగా వారికి పదవులు ఇవ్వడం ద్వారా పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూరగొనవచ్చనే వ్యూహంతో సీఎం కేసిఆర్ ఉన్నట్టు ప్రగతి భవన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి...అవసరమైతే మరోక దళిత వర్గానికి చెందిన వారికే మరో మంత్రి పదవిని ఇచ్చేందుకు కూడా అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.

  దళిత బంధుకు సైతం..

  మరోవైపు దళిత బంధు పథకం అమలుకు కూడా ప్రత్యేకంగా ఒకరిని నియమించి వారికి ఉన్నత స్థానాన్ని ఇవ్వనున్నట్టు తెలుస్తోంది..ఇందుకోసం ఇటివల బీజేపిని వీడిన మోత్కుపల్లిని దళిత బంధు చైర్మణ్‌గా ప్రకటిస్తారనే ప్రచారం కూడా ఊపందుకుంది. కాని మోత్కుపల్లి మాత్రం తనకు ఎలాంటీ సంకేతాలు లేవని చెబుతున్నారు. అయితే ఈ పదవులు ఎవరికి ఇస్తారనే విషయం పక్కన పెడితే దళిత వర్గాన్ని పూర్తిగా తమ కంట్రోల్‌లోకి తెచ్చుకునేందుకు వ్యూహరచన చేస్తున్నట్టుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇదంతా ఎన్నికలకు ముందే పూర్తి చేయనున్నట్టు సమాచారం.

  మీ నగరం నుండి (​హైదరాబాద్)

  తెలంగాణ
  ​హైదరాబాద్
  తెలంగాణ
  ​హైదరాబాద్
  Published by:yveerash yveerash
  First published:

  Tags: CM KCR, Telangana, Telangana Politics

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు