Home /News /telangana /

CABINET DECISIONS FOREST AND WOMEN UNIVERSITY IN TELANGANA VRY

Cabinet decision : ఆ కాలేజీలో చదువుకుంటే నేరుగా ఉద్యోగాలే.. మరో రెండు యూనివర్శిటిలకు కసరత్తు

Cabinet decision

Cabinet decision

Cabinet decision : తెలంగాణ కేబినెట్ విద్యా వ్యవస్థబలోపేతానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం విద్యా, స్కూళ్ల ఆధునీకరణతో పాటు ఓ మహిళా యూనివర్శిటి ఏర్పాటుతో పాటు ఫారెస్ట్ కాలేజీకి విద్యార్థులకు శుభవార్తను అందించింది.

ఇంకా చదవండి ...
  ప్రభుత్వ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ శుభవార్తను అందించింది. రానున్న విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లీష్ మీడియం స్కూళ్లుగా మార్చనున్నట్టు తెలిపింది. ఇందుకు సంబంధించి విధివిధాలను రూపోందించేందుకు పలువురు సీనియర్ మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో రానున్న అసెంబ్లీ సమావేశాల వరకు కమిటిని తన నివేదికను అందించాలని కోరింది. ఈ ఇంగ్లీష్ విద్య కోసం చట్టాన్ని రూపోందించి వచ్చే విద్యా సంవత్సరం నుండే ప్రవేశపెట్టాలని కేబినెట్ నిర్ణయించింది.

  మరోవైపు రాష్ట్రంలో మహిళా యూనివర్సీటీ ఏర్పాటుపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే దీనిపై కూడా సమగ్ర నివేదికును అందించాల్సిగా కోరింది. వచ్చే కేబినెట్ సమావేశంలోనే దీనిపై చర్చించి అమోదం తెలిపే విధంగా ప్రతిపాదనలు సిద్దం చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

  Peddapally : చెల్లెలు చనిపోయి నాలుగు రోజులు గడిచినా.. బయటికి చెప్పని అక్క.. దుర్వాసనతో ఇంట్లోనే..! కారణం ఇదేనా...?

  సిద్ధిపేట జిల్లా ములుగులోని ఎఫ్.సి.ఆర్.ఐ. లో చదువుకున్న అర్హులైన విద్యార్థులకు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగాల భర్తీలో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కోటా కింద పలు విభాగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేబినేట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్’ (ఎ.సి.ఎఫ్.) విభాగంలోని ఉద్యోగాల్లో 25 % రిజర్వేషన్లు, ‘ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్’ (ఎఫ్.ఆర్.ఒ.) విభాగానికి చెందిన ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు, ‘‘ఫారెస్టర్స్’’ విభాగానికి చెందిన ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని కేబినేట్ నిర్ణయించింది.

  ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ సర్వీస్ రూల్స్ (1997) మరియు తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ (2000) లలో సవరణలు చేపట్టాలని కేబినేట్ నిర్ణయించింది. మరోవైపు
  రాష్ట్రంలో ‘ఫారెస్ట్ యూనివర్సిటీ’ ఏర్పాటుకు కేబినేట్ అంగీకరించింది. అటవీశాఖ అధికారులు ఈ దిశగా ప్రాథమిక సమాచారంతో కూడిన నివేదికను కేబినేట్ కు అందించగా, వచ్చే కేబినేట్ సమావేశం నాటికి పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసుకొని రావాలని అటవీశాఖ అధికారులను కేబినేట్ ఆదేశించింది. కాగా ఇప్పటికే సిద్ధిపేట జిల్లా ములుగులోని ‘ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్’ (ఎఫ్.సి.ఆర్.ఐ) లో బి.ఎస్సీ. ఫారెస్ట్రీ (హానర్స్) నాలుగేండ్ల డిగ్రీ కోర్సు ద్వారా అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్వాలిఫైడ్ ఫారెస్ట్రీ గ్రాడ్యుయేట్స్ ను ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే..

  Hyderabad : ఇంకా ఆగలేము.. ఈ కార్ రేసింగ్ పోటిలపై ఆనంద్ మహింద్రా, మంత్రికి Thanks అంటూ ట్వీట్

  ప్రభుత్వ విద్యకు మరింత ప్రాముఖ్యత ఇవ్వడంలో భాగంగా ప్రవేశపెట్టిన మన ఊరు-మనబడికి పథకం కింద పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7289 కోట్ల తో ...ప్రణాళిక కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది.

  మరోవైపు ప్రైవేట్ స్కూల్లు, జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ ., మరియు., వచ్చేవిద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధనకై.., కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రెండు అంశాల పై పూర్తి అధ్యయనం చేసి సంబంధిత విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షురాలిగా.. మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి , పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటిఆర్ లు ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: CM KCR, Telangana cabinet

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు