హోమ్ /వార్తలు /తెలంగాణ /

Business Ideas: కిన్నో పండ్లకు మార్కెట్‌లో ఫుల్ డిమాండ్.. ఈ పంటతో రైతులకు అధిక లాభాలు

Business Ideas: కిన్నో పండ్లకు మార్కెట్‌లో ఫుల్ డిమాండ్.. ఈ పంటతో రైతులకు అధిక లాభాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Business Idea: బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా , ఢిల్లీ వంటి నగరాల్లో కిన్నో పండ్లకు మంచి మార్కెట్ ఉంది. విదేశాలకు కూడా ఎగుమతి చేసుకోవచ్చు. శ్రీలంక, సౌదీ అరేబియా ప్రజలు కూడా ఇష్టంగా తింటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఈ మధ్య చాలా మంది వ్యవసాయ సంబంధిత వ్యాపారాలవైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. వాణిజ్య పంటలు పండించడం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. పెద్దగా పెట్టుబడి అవసరం లేని వ్యాపారాలను ఎంచుకుంటున్నారు. వ్యవసాయ రంగంలో... కొంచెం కష్టపడి పనిచేసి.. విభిన్నమైన పంటలను పండిస్తే.. మంచి లాభాలు (Business Ideas) వస్తాయి. తక్కువ పెట్టుబడితే మంచి ఆదాయం ఇచ్చే ఓ పంట గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలా మంది కిన్నో (Kinnow Fruits) పంటను సాగు చేస్తున్నారు. బత్తాయి, నారింజలతో పోల్చితే.. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అందుకే మార్కెట్లో ఈ పండ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

కిన్నో పండ్లు కూడా సిట్రస్ జాతి (Citrus Fruits)కి చెందినవే. వీటిని మనదేశంలోని పంజాబ్ , హిమాచల్ ప్రదేశ్ , రాజస్థాన్ , మధ్యప్రదేశ్, హర్యానా , జమ్మూ కాశ్మీర్‌లలో ఎక్కువగా పండిస్తున్నారు. అంటే దక్షిణ భారత దేశంతో పోల్చితే ఉత్తర భారతదేశంలోనే అధికంగా సాగు చేస్తున్నారు. సౌత్‌లో కూడా కొన్ని ప్రాంతాల్లో కిన్నో పండ్లను పండస్తున్నారు. ఈ పండ్లలో ఎముకల పటిష్టత, రోగనిరోధక శక్తిని పెంచే.. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కిన్నోవ్ తినడం వల్ల జీర్ణ శక్తి కూడా మెరుగ్గా ఉంటుంది.

ఈ పోస్టాఫీస్ స్కీమ్‌‌తో డబ్బే డబ్బు.. చేరితే రూ.4 లక్షలు మీవే!

కిన్నో పండ్లను లోమీ, బంకమట్టి, ఆమ్ల నేలలో సాగు చేయవచ్చు. నీరు సులభంగా బయటకు పోయే ప్రదేశంలో పంటు వేసుకోవాలి. ఒక్కో చెట్టు ఖరీదు దాదాపు రూ.50 వరకు ఉంటుంది. ఒక ఎకరంలో సుమారు 214 కిన్ను చెట్లు నాటవచ్చు. ఒక చెట్టు నుంచి సుమారు 80-150 కిలోల కిన్నో పండ్లు వస్తాయి. ఈ పంటకు 13 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనువుగా ఉంటుంది. 300-400 మిమీ వర్షం సరిపోతుంది. పంట కోత సమయంలో ఉష్ణోగ్రత 20-32 డిగ్రీల సెల్సియస్ ఉండేలా చూసుకోవాలి. కిన్నో మంచి రంగులో ఉన్నప్పుడు కత్తెర సాయంతో కత్తిరించాలి. అనంతరం బాగా కడిగిన తర్వాత.. ఆరబెట్టాలి.

ఈ పండ్లను బహిరంగ మార్కెట్‌కి తీసుకెళ్లి మీరే అమ్మవచ్చు. లేదంటే హోల్ సేల్‌గా వ్యాపారులకు విక్రయించవచ్చు. బెంగళూరు, హైదరాబాద్ , కోల్‌కతా , ఢిల్లీ వంటి నగరాల్లో కిన్నో పండ్లకు మంచి మార్కెట్ ఉంది. విదేశాలకు కూడా ఎగుమతి చేసుకోవచ్చు. శ్రీలంక, సౌదీ అరేబియా ప్రజలు కూడా ఇష్టంగా తింటారు. ఆరెంజ్ పండ్ల సీజన్ ముగిసిన తర్వాత వీటికి డిమాండ్ పెరుగుతుంది. నాణ్యత బట్టి రేటు ఉంటుంది. బహిరంగ మార్కెట్లో కిలో కిన్నో పండ్ల ధర రూ.100 వరకు ఉంటుంది. పెద్ద మొత్తంలో వీటిని సాగు చేస్తే.. అధిక లాభాలు వస్తాయి.

(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)

First published:

Tags: Business, Business Ideas, Local News, Telangana

ఉత్తమ కథలు