హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri Kothagudem: సాఫ్ట్ వేర్ కొలువు వదిలి డ్రాగన్ ఫ్రూట్ సాగు.. యువరైతు అనుభవాలు ఇవే

Bhadradri Kothagudem: సాఫ్ట్ వేర్ కొలువు వదిలి డ్రాగన్ ఫ్రూట్ సాగు.. యువరైతు అనుభవాలు ఇవే

శివ శంకర్

శివ శంకర్

Dragon Fruit Farming: యువరైతు శివశంకర్ డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు చేయడంతో  ఆ పంటను చూసిన పలువురు రైతులు డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు, సాగులో మెలకువలు, సాగు చేయడానికి కావలసిన మొక్కలు, సామాగ్రి ఎలా పొందాలో అడిగి తెలుసుకుంటున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Kothagudem

(జి. శ్రీనివాస్ రెడ్డి న్యూస్ 18 తెలుగు, ఖమ్మం)

ఈ రోజుల్లో చాలా మంది వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. పెద్ద పెద్ద కొలువులు కూడా వదిలిపెట్టి పొలంలోకి దిగుతున్నారు. ఈ యువకుడు చాలాకాలం సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. తనకు తన ఉద్యోగంలో ఎక్కడ సంతృప్తి లభించలేదు. ఏం చేస్తే తనకు సంతృప్తి లభిస్తుందా అనే ఆలోచనలో ఉండగానే తనకున్న భూమిలో వ్యవసాయం చేస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన వచ్చింది.. దీంతో ఉన్నపలంగా పూణేలో తను చేస్తున్న ఉద్యోగం మానేశాడు. తనకు అప్పటికే ఉన్న పామాయిల్ తోట పక్కనే నాలుగు ఎకరాల పొలంలో డ్రాగన్ ఫ్రూట్స్ సాగు మొదలుపెట్టాడు. తొలుత కొద్దిగా పెట్టుబడి ఎక్కువ అయినప్పటికీ అది ఒక్క సారికే పరిమితం కావడం వల్ల ఆ పంట వైపు మొగ్గాడు. పెట్టుబడి నిత్య పర్యవేక్షణ అవసరమైన ఈ పంట సాగు  అనుకుంటే అంత కష్టమేం కాదని ఈ సాఫ్ట్‌వేర్ యువకుడు నిరూపించాడు. ఇప్పటికే ఫల సాయం మొదలైందని.. మరో ఏడాది రెండేళ్లలో పూర్తిస్థాయి దిగుబడి సాధించడం సాధ్యమవుతుందని చెబుతున్నాడు ఈ యువకుడు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రానికి చెందిన ఏలూరి శివ శంకర్, సూర్య తేజ.  మెకానికల్ ఇంజనీర్ విద్యను పూర్తి చేశారు, అనంతరం ఇద్దరికీ పూణే, బెంగళూరు పట్టణాల్లోని   మల్టీనేషనల్ కంపెనీలలో ఉద్యోగాలు సాధించారు, ఉద్యోగాలు చేస్తున్న వారిద్దరికీ పలువురికి ఆదర్శంగా నిలవాలన్న కోరిక కలిగింది. అన్న శివ శంకర్ కు తమకున్న వ్యవసాయ భూమిలో రైతుగా మారి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట సాగు చేద్దామని కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయించుకున్నాడు. సామాజిక మాధ్యమాలలో పలు పంటల గురించి తెలుసుకున్నారు.

ప్రస్తుత మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ పంటకు విలువ ఉండడంతో ఆ పంటను సాగు చేయాలని నిర్ణయించుకుని ఆ పంట సాగు శ్రీకారం చుట్టాడు. వియత్నాం దేశంకు చెందిన సీఎం రెడ్ అనే వంగడం మొక్కలు సేకరించి తనకున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో నాటాడు. మొక్కల పెంపకానికి, మొక్కలు పాకడానికి సపోర్టుగా స్తంభాలు, ఇనుప తీగ, బిందు సేద్య పరికరాల కోసం రైతు శివ శంకర్ ఎకరానికి 6 నుండి 7 లక్షల వరకు ఖర్చవుతుంది తెలిసిన అయినా ఏలాంటి ధైర్యం కోల్పోకుండా పెట్టుబడి పెట్టి మొదటి సంవత్సరంలోనే నెమ్మదిగా ఫలితాలు సాధిస్తున్నాడు. డ్రాగన్ ఫ్రూట్ మొక్క నాటిన మొదటి ఏడాది ఎకరంలో  రెండు క్వింటాల దిగుబడి వచ్చిందనీ. రెండో  ఏడాది నుండి రెండు టన్నులు, మూడో సంవత్సరం నుండి 5 టన్నుల వరకు దిగుబడి సాధించవచ్చని యువ రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

డ్రాగన్ ఫ్రూట్‌కు అద్భుతమైన డిమాండ్ ఉందని, మార్కెట్ సదుపాయం కూడా బాగానే ఉందంటున్నాడు శివశంకర్. భవిష్యత్తులో తానే మొక్కల సరఫరా కూడా చేయాలని అనుకుంటున్నట్టు శివశంకర్ చెబుతున్నారు. ఒకే చోట తోట పెంపకం అలాగే నర్సరీ సిద్ధం చేయబోతున్నట్లు శివశంకర్ చెప్పారు. లాక్ డౌన్ టైమ్‌లో ఏం చేస్తే బాగుంటుందా అన్న ఆలోచనలో గూగుల్‌లో సెర్చ్ చేసి ఈ పంట పండిస్తే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు. స్వతహాగా మెకానికల్ ఇంజనీర్ అయినటువంటి శివశంకర్ ఇప్పుడు సాగులో తన చదువును టెక్నాలజీని జోడించి ఫలితాలు రాబట్టబోతున్నాడు.

 Shamshabad Metro: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో లైన్..

అయితే డ్రాగన్ ఫ్రూట్ సాగులో ఉన్న పెద్ద ఆటంకం ఏంటి అంటే.. తొలిసారి పెట్టే పెట్టుబడి ఎక్కువగా ఉండటమే అంటున్నాడు శివశంకర్.  సుమారుగా ఎకరానికి 6 నుంచి ఏడు లక్షలు పెట్టుబడి అవసరము అవుతుంది. మొక్కల కొనుగోలు ప్రతి మొక్కకు ఒక రాతి స్తంభం ఏర్పాటు చేయడం.. అదేవిధంగా డ్రిప్పు ఏర్పాటు.. విరసి ఎకరానికి 6 నుంచి 7 లక్షలు ఉంటేనే సమృద్ధిగా పెట్టుబడి ఉన్నట్లని శివశంకర్ చెప్తున్నారు.. అయితే పంట బాగా తీయగలిగితే టన్ను లక్ష  50వేల వరకు ధర పలికే అవకాశం ఉందని చెప్పారు ఈ రైతు. ఏడాదికి ఎకరానికి మూడు టన్నులు దిగుబడి వస్తుందనుకున్నా గానీ, ఎకరానికి నాలుగున్నర లక్షల ఆదాయం  వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉత్సాహవంతులైన రైతులు ధైర్యంగా ఈ పంట సాగును చేయొచ్చు అంటున్నారు శివశంకర్.

డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ఆసక్తి చూపుతున్న రైతులు

యువరైతు శివశంకర్ డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు చేయడంతో  ఆ పంటను చూసిన పలువురు రైతులు డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు, సాగులో మెలకువలు, సాగు చేయడానికి కావలసిన మొక్కలు, సామాగ్రి ఎలా పొందాలో అడిగి తెలుసుకుంటున్నారు. దీర్ఘకాలిక పంట కావడంతో రైతులు ఈ పంటను సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసే విధానం

డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయడానికి  భూమిని ముందుగా లోతు దుక్కులు దున్నుకొని, భూసార పరీక్షలు చేయించుకోవాలని, భూసార పరీక్షలు వచ్చిన ఫలితాల ప్రకారం వ్యవసాయ శాఖ,ఉద్యాన శాఖ అధికారులను పంట సాగు చేయొచ్చా లేదా అనే దానిపై అడిగి తెలుసుకొని, సాగుకు అనుకూలమే అని తెలిపిన తర్వాత ముందుగా పది అడుగుల వెడల్పుతో , ఎకరానికి 500 స్తంభాలను నాటు కోవాలి,అనంతరం మార్కెట్లో డిమాండ్ ఉన్న మేలైన డ్రాగన్ ఫ్రూట్ వెరైటీ జాతి మొక్కను ఎంచుకొని నాటుకోవాలి, బిందు సేద్యం ద్వారా మొక్కలకు నీటిని అందించి,  మొక్కలు పడిపోకుండా స్తంభానికి తాడుతో కట్టి స్తంభం పైకి ఎక్కేటట్లు చూసుకోవాలి, ఆ తర్వాత మొక్కల పాదు దగ్గర పశువుల ఎరువులను వేయాలని, మొక్కలకు చీడ లాంటిది కనపడితే సాఫ్  మందు పిచికారి చేస్తే సరిపోతుందని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఉద్యాన పంట డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసే రైతులకు, ప్రభుత్వం ప్రోత్సాహాలు అందించడంలో వెనకడుగు వేస్తోంది. ఎంతో పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్న రైతులకు ప్రోత్సాహం అందడం లేదు, ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్న పంటలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాలు అందితే పంటలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని రైతులు చెబుతున్నారు.

First published:

Tags: Bhadradri kothagudem, Dragon Fruit, Telangana