హోమ్ /వార్తలు /తెలంగాణ /

శుభకార్యానికి వెళ్తూ.. ఆర్టీసీ బస్సు ఢీకొని దంపతులు మృతి

శుభకార్యానికి వెళ్తూ.. ఆర్టీసీ బస్సు ఢీకొని దంపతులు మృతి

రోడ్డు ప్రమాదంలో విషాదం

రోడ్డు ప్రమాదంలో విషాదం

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

    రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో దంపతులు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బైక్‌పై శుభకార్యానికి వెళ్తున్న భార్య భర్తల్ని... ఆర్టీసీ బస్సు ఢీకొట్టండంతో వారిద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులు పెద్ద అంబర్‌పేట్‌ కోహెడకు చెందిన బొక్క రమణారెడ్డి, విజయమ్మగా గుర్తించారు. ప్రమదానికి కారణమైన బస్సు పశ్చిమ గోదావరి జిల్లా తుని డిపోకు చెందినదిగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు.

    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Apsrtc, Rtc

    ఉత్తమ కథలు