Bullettu Bandi Bride: బుల్లెట్టు బండి వధువుకు ఊహించని కానుక.. బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన సంస్థ

బుల్లెట్ బండి వధువుకు బంపర్ ఆఫర్

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది బుల్లెట్ బండి పాట.. ఆ పాటకు డ్యాన్స్ వేసిన నవ వధువుతో పాటు ఆమె భర్త కూడా ఫ్యామస్ అయ్యారు. తాజాగా ఆ నవ వధుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది ఓ సంస్థ..

 • Share this:
  బుల్లెంట్ బండి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారిన పాట.. తెలంగాణ యాసలో ఎంతో మధురంగా ఉన్న బుల్లెట్టు బండి పాట ఎప్పుడో పాపులర్ అయ్యింది. అయితే ఆ పాటకు ఓ నవ వధువు డ్యాన్స్ వేసి.. అందిర్నీ ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు ఎవరి నోట విన్నా ఇదే పాట వినిపిస్తోంది. బుల్లెట్ బండి పాటకు తెలంగాణకు చెందిన నూతన వధువు డాన్స్ ఇరగదీయడంతోనే ఇంత క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ఆ జంట డాన్స్‌కు సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయ్యింది. అందుకే పలు ఛానెల్స్ కూడా వారి ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. మొన్నటి వరకు ఆ కుటుంబ గురించి చుట్టు పక్కల వాళ్లకు, బంధువులకు తప్ప ఎవరికీ అంతగా తెలియదు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దీంతో ఆ జంటకు స్థానికులు బ్రహ్మరథం పడుతున్నారు. తమ ప్రాంతానికి చెందిన వారు కావడంతో సన్మానాలు, సత్కారలతో ముంచెత్తుతున్నారు.

  కొంత జంట కావడంతో వారికి తోచిన విధంగా విషెస్ చెబుతూ ఆత్మీయరాగాన్ని పంచుతున్నారు. ఆ వీడియో సోషల్‌ మీడియాను ఇంకా షేక్‌ చేస్తూనే ఉంది. షార్ట్ వీడియోలు చేసేవారు ఆ పాటకు చిందులేస్తూ టాలెంట్ చూపిస్తున్నారు. ఒక జానపదం పాటకు చేసిన డ్యాన్స్‌ వీడియో ట్రెండింగ్‌లోకి వెళ్లడం చాలా అరుదు.. కానీ ఆ నవ వధువు కారణంగా ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. దీంతో ఆ డ్యాన్స్‌ చేసిన యువతికి ఇప్పుడు ఓ బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. ఏ పాటకైతే డ్యాన్స్‌ చేసిందో ఆ పాటను నిర్మించిన సంస్థ ఆఫర్ ను అధికారికంగా ప్రకటించింది..

  మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్‌ఎస్‌ఓ రాము, సురేఖ దంపతుల పెద్ద కుమార్తె.. సాయి శ్రీయను రామకృష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో ఈనెల 14న పెళ్లి చేశారు. అయితే అప్పగింతల సమయంలో సాయిశ్రీయ చేసిన డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. ఆమె డ్యాన్స్‌ చేసిన పాటను నిర్మించిన సంస్థ బ్లూ రాబిట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌. రచయిత లక్ష్మణ్‌ సాహిత్యానికి ఎస్‌కే బాజి సంగీతం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు. ఆ పాటను అద్భుతంగా తెరకెక్కించిన బ్లూ రాబిట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్వాహకులు నిరూప స్పందించారు. సాయిశ్రీయతో నిరూప ఫోన్‌లో మాట్లాడారు. http://  తమ సంస్థలో నిర్మించే తరువాతి సాయి శ్రీయను నటించాలి అంటూ కోరారు. దీంతో సాయిశ్రీ ఆనందంతో ఉబ్బితబ్బిబైంది. ఇప్పటి వరకు ఎలాంటి అనుభవం లేకపోయినా.. అంత పెద్ద అవకాశం రావడంతో సాయిశ్రీయ ఆఫర్ ను కాదు అనలేకపోయింది. దీంతో సాయి శ్రీయ త్వరలోనే ఆమె ప్రధాన పాత్రలో ఓ పాట రాబోతోంది. బ్లూ రాబిట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఆవిర్భవించి దాదాపు రెండేళ్లవుతోంది. ఈ సంస్థ గతంలో అనేక పాటలు రూపొందించింది. బిగ్ బాస్ ఫేమ్ రాహుల్‌ సిప్లిగంజ్‌, నోయల్‌తో పలు పాటలు పాడించింది. వారు ఎన్నో అద్బుతమైన పాటలు పాడారు.. తెలంగాణ వ్యాప్తంగా ఆ పాటలు ఆకట్టుకుంటున్నాయి. అయితే అన్ని పాటలకు రాని క్రేజ్ ఇప్పుడు నవ వధువు డ్యాన్స్ కారణంగా బుల్లెట్‌ బండి వైరల్ గా మారింది. ఆ పాటతో ఆ సంస్థకు మంచి క్రేజ్‌ ఏర్పడింది. తమ తదుపరి పాటకు డ్యాన్స్‌ చేసే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ నిర్వాహకురాలు ప్రకటించారు.
  Published by:Nagesh Paina
  First published: