హోమ్ /వార్తలు /తెలంగాణ /

గణేష్ నిమజ్జనంలో తుపాకీ కాల్పులు.. హైదరాబాద్‌లో కలకలం..

గణేష్ నిమజ్జనంలో తుపాకీ కాల్పులు.. హైదరాబాద్‌లో కలకలం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఊరేగింపులో అకస్మాత్తుగా కాల్పులు జరగడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. చెల్లా చెదురుగా పారిపోయారు.

కరోనా నేపథ్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సాదాసీదాగా జరుగుతున్నాయి. భక్తి పాటల హోరు, డీజేల మోత, తీన్మార్ డాన్స్‌లు లేవు. నిమజ్జనం వేడుకలు కూడా గతం మాదిరి కాకుండా సింపుల్‌గా చేస్తున్నారు. ఐతే కొందరు మాత్రం ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా ఘనంగా ఊరేగింపు చేస్తున్నారు. హైదరాబాద్‌ శివారులోని నార్సింగ్‌లో ఇలాగే వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఐతే ఊరేగింపులో అకస్మాత్తుగా కాల్పులు జరగడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. చెల్లా చెదురుగా పారిపోయారు.

నార్సింగిలోని హైదర్ష్‌కోట శివం హైట్స్‌లో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల జరిపిన వ్యక్తిని నాగ మల్లేష్‌గా గుర్తించారు. అతడు ఆర్మీ మాజీ జవాన్‌ అని స్థానికుల ద్వారా తెలిసింది. మద్యం మత్తులో కాల్పులు జరిపాడని.. మొత్తం రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఒక బుల్లెట్ గాల్లోకి వెళ్లగా.. మరో బుల్లెట్ పక్కనే ఉన్న ఓ వ్యక్తి చెవి పక్క నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నాగ మల్లేష్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

First published:

Tags: Ganesh Chaturthi 2020, Ganesh immersion, Hyderabad, Telangana

ఉత్తమ కథలు