• HOME
 • »
 • NEWS
 • »
 • TELANGANA
 • »
 • BUILDER FRAUD RS ONE CRORE IN THE NAME OF DISCOUNTS IN KHAMMAM DISTRICT LEADS TO ONE OLD WOMAN DEATH HSN

ఖమ్మంలో బయటపడ్డ కోటి రూపాయల మోసం.. దిగులుతో మరణించిన వృద్ధురాలు.. అసలు కథేంటంటే..

ఖమ్మంలో బయటపడ్డ కోటి రూపాయల మోసం.. దిగులుతో మరణించిన వృద్ధురాలు.. అసలు కథేంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

సగటు మనిషి బతుకంతా నమ్మడం, మోసపోవడంలా మారిపోయింది. ఇప్పుడు ఈ జాఢ్యం దాదాపు అన్ని రంగాలకు పాకిపోయింది. రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని, కన్సస్ట్రక్షన్‌ రంగాన్ని కూడా తాకింది. ముందస్తు చెల్లింపులు చేస్తే ధరలో తగ్గింపులుంటాయన్న ఓ బిల్డర్‌ మాయాజాలంలో పడి..

 • Share this:
  ఆశకు అంతులేనంత కాలం మోసాలకు హద్దుండదంటారు పెద్దలు. అచ్చం అలాగే జరుగుతున్న పరిస్థితులు మనం నిత్యం చూస్తునే ఉన్నాం. సగటు మనిషి బతుకంతా నమ్మడం, మోసపోవడంలా మారిపోయింది. ఇప్పుడు ఈ జాఢ్యం దాదాపు అన్ని రంగాలకు పాకిపోయింది. రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని, కన్సస్ట్రక్షన్‌ రంగాన్ని కూడా తాకింది. ముందస్తు చెల్లింపులు చేస్తే ధరలో తగ్గింపులుంటాయన్న ఓ బిల్డర్‌ మాయాజాలంలో పడ్డ సుమారు పాతికమంది మధ్యతరగతి జీవులు అడ్డంగా మోసపోయారు. ఒక్కొక్కరు రూ.లక్షల్లో నష్టపోయాక పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. నమ్మించి.. జనం సొమ్ములు కొట్టేసి ముఖం చాటేసిన బిల్డర్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన పోలీసు యంత్రాంగం కేసు అయితే ఫైల్‌ చేసింది కానీ, ఎలా ముందుకెళ్లాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతోంది. ఖమ్మం నగరంలో చోటుచేసుకున్న 'రియల్‌' మోసమిది. కష్టపడి కూడబెట్టిన సొమ్మంతా పోవడంతో దిగులుతో మంచం పట్టిన ఓ వృద్ధురాలు రెండు రోజుల క్రితం తనువు చాలించింది.

  ఖమ్మం నగరంలోని ఐదో డివిజన్‌ పరిధిలోని ఖానాపురంలోని సర్వే నెంబరు 183లో ఓ ముగ్గురికి చెందిన 960 చదరపు గజాల స్థలాన్ని ఓ బిల్డర్‌ డెవలప్‌మెంట్‌కు తీసుకున్నాడు. 60-40 నిష్పత్తిలో బిల్డర్‌, స్థలాల యజమానులకు ఫ్లాట్లు చెందేటట్లు అగ్రిమెంట్‌ రాసుకున్నారు. ఇలా స్థల యజమానులు నాగండ్ల శ్రీనివాసరావు, గడ్డం రమాదేవి, ఆలపాటి కృష్ణకుమారిలతో దేవాంశ్‌ బిల్డర్స్‌ పేరిట‌ తాను ఖరారు చేసుకున్న నియమనిబంధనలతో లిఖితపూర్వకంగా బిల్డర్‌ అగ్రిమెంటు చేసుకున్నాడు. బిల్డింగ్‌ ఎలా ఉంటుంది.. ఫ్లాట్స్‌ ఏ రూపంలో ఎంతెంత విస్తీర్ణంలో.. ఎలాంటి సౌకర్యాలతో ఉంటాయన్న డీటెయిల్డ్‌ స్కెచ్‌తో ఓ అందమైన బ్రోచర్‌ రూపొందించాడు. మార్కెటింగ్‌ కోసం కొందరు దళారులను కూడా పెట్టుకున్నాడు. ముందుగా బుక్‌ చేసుకుంటే ఒకరేటు.. అంతా పూర్తయ్యాక వస్తే మరో రేటంటూ ప్రచారం చేశారు. ఇకాస్త ముందుకెళ్లి అడ్వాన్సుగా రూ.5 నుంచి 10 లక్షలు చెల్లిస్తే చదరపు అడుగు ధరలో మరింత డిస్కౌంట్‌ ఇస్తానని నమ్మబలికారు.
  ఇది కూడా చదవండి: ప్రేయసితో భర్త ఎస్కేప్.. ఎక్కడున్నారో తెలిసి వెళ్లిన భార్య.. వారితోనే ఉండేందుకు డీల్.. చివరకు కథ అడ్డం తిరిగింది..!

  కోటి రూపాయల వరకు పోగేసుకున్న బిల్డర్
  ఆర్నెళ్లు లేదంటే మహా అయితే ఏడాదిలో పూర్తై స్వాధీనంలోకి వచ్చే ఫ్లాట్‌కు ధర బాగా తగ్గుతుందనగానే జనం నమ్మేశారు. ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షలు వరకు కొందరు ముట్టజెప్పారు. ఈ ప్రాసెస్‌లో జనాన్ని నమ్మించడానికి బిల్డర్‌ పెట్టిన ఖర్చు ఏదైనా ఉందంటే.. అగ్రిమెంటు పేపర్లు.. రెండు బోర్లు వేయడం.. ఓ బ్రోచర్‌ రూపకల్పన మాత్రమే. ఇలా మొత్తం మీద ఓ ఇరవై మంది సదరు బిల్డర్ను‌ నమ్మి దాదాపు కోటికి పైగా ముట్టజెప్పారు. ఇక్కడో మరో దారుణం ఏంటంటే.. 40 శాతం ఫ్లాట్లకు స్థలాన్ని ఇవ్వడానికి అంగీకరించిన యజమానులు ఇంకాస్త ముందుకు వెళ్లారు. తక్కువకు వస్తున్నాయని తమ దగ్గర ఉన్న సొమ్మును చెల్లించి మరికొన్ని ఫ్లాట్లను సైతం బుక్‌ చేసుకున్నారు. వెరసి ఇటు స్థల యజమానులు, అటు ఫ్లాట్లు బుక్‌ చేసుకున్నవాళ్లు గుత్తాగా మోసపోయారు.
  ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో చార్టెడ్ అకౌంటెంట్.. రూ.3000 కోసం ట్రై చేస్తే.. ఏకంగా రూ.6,00,000 పోగొట్టుకున్నాడు.. అసలేం జరిగిందంటే..

  ఎంతకూ నిర్మాణం మొదలు పెట్టకపోవడంతో అనుమానం
  డబ్బు చెల్లించి నెలలు పూర్తయినా బిల్డింగ్‌ నిర్మాణం మొదలు పెట్టడం లేదేంటని ప్రశ్నించినపుడల్లా పర్మిషన్లు రాలేదని సాకులు చెబుతూ వచ్చాడు. 2020 జనవరి 20న స్థలంలో బోర్‌ వేశాడని, అప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడేమీ చేయలేదని బాధితులు వాపోతున్నారు. తమ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమోనని సదరు బిల్డర్‌ తప్పించుకు తిరుగుతున్నాడని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. తాము పూర్తి స్థాయిలో మోసపోయామని గ్రహించిన బాధితులు ఈ మధ్యనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా మోసపోయిన వారిలో 80 ఏళ్ల వృద్ధులు సైతం ఉన్నారంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు.
  ఇది కూడా చదవండి: అయ్యో పాపం.. జీవితాంతం సంపాదించిన సొమ్మంతా ఒక్క ఫోన్ కాల్ తో మటాష్.. ఏకంగా రూ.77 లక్షలు..

  నెలవారీ చిన్నచిన్న మొత్తాలను దాచిపెట్టుకున్న మధ్య తరగతి కుటుంబాలు ఇపుడు తమకు జరిగిన మోసాన్ని తట్టుకోలేకపోతున్నాయి. వీరిలో మందడపు పద్మ అనే మహిళ రూ.10 లక్షలు చెల్లించి మోసపోగా.. ఆమె తల్లి సీతమ్మ మనోవేదనతో రెండురోజుల క్రితం మృతిచెందింది. ఇలా ప్రతి ఒక్కరినీ వేదనకు గురిచేసిన బిల్డర్‌ మాత్రం ఆచూకీ లేడు. ఇలా ఈ బిల్డర్‌ చేతిలో వట్టికొండ పూర్ణచందర్‌రావు, వనజ, శ్రావణి, రాజయ్య, నున్నా కృష్ణ, ఆనందరావు, అప్పారావు, అనూష, అభిలాష, శ్వేత, రామనాగేంద్ర, ఇంకా మరికొందరున్నారు. ఆచూకీ లేకుండా పోయిన సదరు బిల్డర్‌ను పట్టుకొచ్చి తమకు న్యాయం చేయాల్సిందిగా వారు కోరుతున్నారు.
  Published by:Hasaan Kandula
  First published:

  అగ్ర కథనాలు