కొత్త సచివాలయంపై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు... 10 నెలల్లోనే...

New Secretariat : పాత సచివాలయ కూల్చివేతకు... తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో... తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయ ప్లాన్ రెడీ చేస్తోంది.

news18-telugu
Updated: July 18, 2020, 8:27 AM IST
కొత్త సచివాలయంపై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు... 10 నెలల్లోనే...
కొత్త సచివాలయంపై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు... 10 నెలల్లోనే...
  • Share this:
New Secretariat : తెలంగాణ సచివాలయ కూల్చివేతకు... న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో... ఇక అది ముగిసిన అధ్యాయంగా భావిస్తూ తెలంగాణ ప్రభుత్వం... కొత్త సచివాలయం ఎలా ఉండాలి? ఏం చెయ్యాలనే అంశంపై దృష్టిసారిస్తోంది. జస్ట్ 10 నెలల్లో కొత్త సచివాలయం పూర్తవ్వాలని సీఎం కేసీఆర్... అధికారుల్ని ఆదేశించారు. ఆ రకంగా చూస్తే... వచ్చే ఏడాది మే కల్లా సచివాలయ నిర్మాణం పూర్తైపోయినట్లే. సచివాలయ నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల పనులనూ ఒకేసారి ప్రారంభించేయాలనీ... ఎక్కడా ఆలస్యం కావడానికి వీల్లేదని సీఎం కేసీఆర్ చెప్పారు. 20 రోజుల్లో కూల్చివేత పనులు, శిథిలాల తరలింపు పూర్తవ్వాలన్నారు.

తాజా అంచనాల ప్రకారం... శ్రావణ మాసంలోనే కొత్త సచివాలయ నిర్మాణం ప్రారంభమవుతుందని అంటున్నారు. ఇందుకోసం... ఎక్కడెక్కడి నుంచే ఏవేవో తెప్పించకుండా... స్థానిక వనరులతోనే కొత్త భవన నిర్మాణం ఉండనుందని తెలిసింది. నక్షత్ర నమూనాలో ఉండే కొత్త భవనంలో సౌకర్యాలు, ఛాంబర్లు, ఫ్లోర్లు, ల్యాండ్ స్కేప్ లు, పార్కింగ్, గుడి, బడి, మసీదు, బ్యాంకు ఇతర స్పెసిఫికేషన్స్‌పై ఆర్ అండ్ బీ శాఖ మంత్రి, అధికారులతో సీఎం కసరత్తు చేశారు. త్వరలోనే టెండర్లు పిలవాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు.

సీఎం చెప్పినట్లుగా కొత్త సచివాలయ కసరత్తు మొదలుపెట్టిన అధికారులు, నేడు ఆర్థికశాఖకు సమీకృత కొత్త సచివాలయం ప్రతిపాదనలు పంపనున్నారు. వాటిని పరిశీలించాక... సీఎం కేసీఆర్ ఫైనలైజ్ చేస్తారని తెలిసింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా కొత్త సచివాలయం ఉండనుందని తెలిసింది.

సచివాలయం కింద గుప్త నిధులు :
తెలంగాణ సచివాలయంలోని జీ బ్లాక్ కింద గుప్త నిధులు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొన్ని రోజుల కిందట ఈ విషయాన్ని బయటపెట్టారు. గతంలో కొన్ని పేపర్లలో ఈ వార్తలు వచ్చాయని ఆయన తెలిపారు. నిజాం నిర్మించిన ‘జీ బ్లాక్' భవంనం (అప్పట్లో సైఫాబాద్ ప్యాలెస్) కింద నేలమాళిగలు ఉన్నాయని పురావస్తు శాఖ గతంలోనే గుర్తించిందనీ, వాటి అన్వేషణ కోసం అనుమతి కోరగా కేసీఆర్ సర్కార్ నిరాకరించిందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో గుప్త నిధుల అంశంపై నిజాం వారసులు రంగంలోకి దిగారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడైన ‘నవాబ్ నజఫ్ అలీ ఖాన్'.. ఈ వివాదంపై స్పందించారు. ముస్లిం రాజులు ఎవరూ నేలమాళిగల్లో నిధులు దాచే అలవాటు లేదని స్పష్టం చేశారు. భూమి తప్ప ఇతర ఆస్తులు కూడబెట్టడం మహా పాపమని ఖురాన్‌లో స్పష్టంగా రాసి ఉందన్నారు. కాబట్టి నిజాం రాజులు నేలమాళిగల్లో గుప్త నిధులు దాచారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు.
Published by: Krishna Kumar N
First published: July 18, 2020, 8:27 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading