Home /News /telangana /

BUFFALO SACRIFICE NAME OF VILLAGE FESTIVAL IN VANAPARTHI DISTRICT SNR MBNR

Telangana: ఛీ ఆ ఊరి జనానికి జాలి లేదా .. గ్రామదేవత పేరు చెప్పి ఏం చేస్తున్నారో తెలుసా

(దున్నపోతు బలి)

(దున్నపోతు బలి)

Telangana: గ్రామ దేవత పేరు చెప్పి ఓ సాదుజంతువును బలిస్తారు. గ్రామ ఆచారమంటూ ఊరి ప్రజలు చూస్తుండగానే రైతుకు సాయం చేసే దున్నపోతును వేట కొడవలితో నరికి దాని రక్తంతో అమ్మవారికి తర్పణం చేస్తారు. ఇదెదో ఘనకార్యంలా విచిత్రమైన అనుభూతిని పొందుతారు ఆ ఊరి జనం.

ఇంకా చదవండి ...
    (Syed Rafi, News18,Mahabubnagar)
    జాతరలు(Village festival), వేడుకల పేరుతో ఇప్పటికే చేస్తున్న జీవహింస, జంతుబలి చాలదంటూ ప్రాంతీయ ఆచారాలు, గ్రామ కట్టుబాట్లు, మనుషుల నమ్మకాలతో మరికొన్ని మూగజీవాల ప్రాణాలను అత్యంత దారుణంగా బలిస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వ్యవసాయ పనుల్లో రైతుకు సాయంగా ఉండే దున్నపోతుల్నిbuffalo అత్యంత పాశవికంగా, ఆటవికంగా నరికి ముక్కలు చేయడంపై జంతు ప్రేమికులే కాదు హిందూ సమాజం కూడా తప్పు పడుతోంది. తెలంగాణ(Telangana)లోని వనపర్తి Vanaparthiజిల్లాలో ఆ ఆటవిక సంప్రదాయం అందర్ని విస్మయానికి గురి చేస్తోంది.

    పల్లెల్లో హింసాత్మక చర్యలు..
    వనపర్తి జిల్లా అమరచింత మండలం సింగపేట గ్రామంలో పెద్దమ్మ పండుగ జరుగుతుంది. గ్రామస్తులు ఎంతో భక్తితో ఏటా జరుపుకునే ఈ పండగ వేడుకలో హింసతో కూడిన చర్యలకు గ్రామస్తులు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారే లోపు గ్రామ దేవతల పేరుతో స్థానికులు దున్నపోతును తాళ్లతో బంధించి అందరూ చూస్తుండగా వేట కొడవలితో అతి కిరాతకంగా మొండెం నుంచి తలను వేరు చేస్తారు. ఈ హింసాత్మక విధానంలో దున్నపోతు ప్రాణాలు విడిస్తూ గిలగిల కొట్టుకుంటుంటే కారిపోతున్న రక్తంతో అమ్మవారికి రక్తతర్పణం చేస్తారు. రాత్రి నుంచి తెల్లవారు జాములోగా జరిగే ఈ హింసాత్మక ఘటన కోసం గ్రామస్తుల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో చందాలు వసూలు చేస్తారు. గ్రామంలోని హిందువుల కుటుంబాల దగ్గర నుంచి ప్రతి ఇంటికి వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేస్తారు. అదే విధంగా వ్యవసాయ భూములు ఉన్న రైతుల దగ్గర నుంచి ఎకరానికి ఆరు వందల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఆరు వందలు వసూలు చేశారు.



    సంప్రదాయం పేరుతో రక్తపాతం..
    ఇలా వసూలు చేసిన లక్షలాది రూపాయలను దున్నపోతు బలికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడటం కోసం అధికారుల దగ్గర నుంచి పోతురాజుకు, అర్ధరాత్రి ఊరిలో తిరిగే దిగంబరిగికి (భూతంపిల్లి) పోతును నరికే వ్యక్తులకు భారీగా ముడుపులు అందినట్లు సమాచారం. గ్రామంలో ఇంతటి ఆటవిక చర్యలు పాల్పడుతూ కూడా దున్నపోతు బలికి ఎలాంటి ఆటంకం కలగకుండా సవ్యంగా జరిపిస్తామని ..ఎవ్వరొచ్చినా ఆపలేరనే ధీమాను నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నారు.

    ఇది చదవండి: పాలమూరు జిల్లాలో పచ్చి మోసం .. యాప్‌ ద్వారా 10కోట్లతో వేలాది మందికి పంగనామం



    అడ్డుకునే వారేరి..
    పచ్చని గ్రామాల్లో ..ప్రశాంతమైన వాతావరణం నెలకొన్న పల్లెల్లో ఈతరహా ఆటవిక చర్యలు, హింసాత్మక ఘటనలను అధికారులు అఢ్డుకుంటారో లేదో చూడాలి. అమ్మవారి పేర్లతో దున్నపోతులు బలికాకుండా చూడాలని జీవహింస వ్యతిరేకులు కోరుతున్నారు. అమ్మవారి పేర్లతో గ్రామ సంప్రదాయం అనే ఆచారాన్ని అంటగట్టి రాక్షసానందం పొందుతున్నారని గ్రామస్తులపై జీవహింస వ్యతిరేకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Mahabubnagar, VIRAL NEWS

    తదుపరి వార్తలు