కరెంట్ షాక్‌తో గేదె మృతి.. నష్టపరిహారం ఇవ్వాలంటున్న రైతు

ప్రతీకాత్మక చిత్రం

ఒక ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ.. కొద్దిపాటి పాడి పశువులను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నట్టు లక్ష్మారెడ్డి తెలిపారు. గేదె చనిపోవడంతో ఆర్థికంగా నష్టపోయాయని.. నష్ట పరిహారం ఇప్పించాలని లక్ష్మారెడ్డి స్థానిక విద్యుత్ శాఖ ఏఈకి విజ్ఞప్తి చేశారు.

  • Share this:
    మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం అంకుషాపూర్ గ్రామంలో లక్ష్మారెడ్డి(58) అనే రైతుకి చెందిన పశువు కరెంట్ షాక్ తగిలి చనిపోయింది. ఇటీవలే రూ.70వేలు పెట్టి లక్ష్మారెడ్డి ఆ గేదెను కొన్నాడు. శుక్రవారం పశువులను మేపుకుంటూ వస్తుండగా.. మొండికుంట బావి దగ్గర విద్యుత్ వైర్ తెగి గేదెపై పడింది. దీంతో ఆ పశువు అక్కడికక్కడే మృతి చెందింది. ఒక ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ.. కొద్దిపాటి పాడి పశువులను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నట్టు లక్ష్మారెడ్డి తెలిపారు. గేదె చనిపోవడంతో ఆర్థికంగా నష్టపోయాయని.. నష్ట పరిహారం ఇప్పించాలని లక్ష్మారెడ్డి స్థానిక విద్యుత్ శాఖ ఏఈకి విజ్ఞప్తి చేశారు.
    First published: