• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • BUFFALO COMES IN FRONT OF POLICE OFFICER CAR SI ATTACKS ON 80 YEARS OLD AGE MAN BA

కారుకు అడ్డొచ్చిన గేదెలు.. వృద్ధుడి కాలు విరగ్గొట్టిన పోలీస్

కారుకు అడ్డొచ్చిన గేదెలు.. వృద్ధుడి కాలు విరగ్గొట్టిన పోలీస్

పోలీసు దాడి చేయడంతో గాయపడిన వృద్ధుడు

ఎస్‌ఐ విజయ్ కుమార్ తన కారులో వస్తుండగా మనిగిళ్ల గ్రామానికి చెందిన 80 సంవత్సరాల మాధవరెడ్డి గేదెలను మేపేందుకు రోడ్డు వెంబడి తీసుకెళ్తున్నాడు.

  • Share this:
    వనపర్తి జిల్లా పెద్దమందడి పోలీస్ సింహానికి కోపం వచ్చింది. రహదారిపై తన కారుకు అడ్డువచ్చిన గేదెలను పక్కకు కొట్టలేదని 80 ఏళ్ల వృద్దునిపై దాడి చేశాడో పోలీస్. దీంతో ఆ వృద్దునికి మోకాలు చిప్పకు తీవ్రగాయమైంది. శుక్రవారం ఉదయం వనపర్తి నుంచి పెద్దమందడి పోలీస్ స్టేషన్ కు ఎస్‌ఐ విజయ్ కుమార్ తన కారులో వస్తుండగా మనిగిళ్ల గ్రామానికి చెందిన 80 సంవత్సరాల మాధవరెడ్డి గేదెలను మేపేందుకు రోడ్డు వెంబడి తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో గేదెలు కారుకు అడ్డువచ్చాయి. కొద్దిసేపు గేదెలు పక్కకు జరగకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు ఎస్‌ఐ విజయ్ కుమార్. వెంటనే కారు దిగి గేదెల వెంబడి వెళ్తున్న మాధవ రెడ్డిని బూతులు తిడుతూ ముందుకు తోసివేవాడు. దీంతో వృద్ధఉడు రోడ్డుపై పడిపోయాడు. ఫలితంగా మోకాలి చిప్పకు తీవ్రగాయమైంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అయితే, అసలు మాధవరెడ్డికి వినికిడి లోపం ఉందని, ఒక చెవి పనిచేయదని కుటుంబసభ్యులు చెప్పారు. కనీసం వృద్ధుడని కూడా చూడకుండా అతడిని గాయపర్చడంపై మనిగిల్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు