Home /News /telangana /

BSNL RETIRED EMPLOYEE ALONG WITH WOMAN CHEATING UNEMPLOYED JOB ASPIRANTS IN KHAMMAM DISTRICT SSR KMM

Khammam: ఈ బీఎస్‌ఎన్‌ఎల్ రిటైర్డ్ ఉద్యోగికి ఇదేం పోయే కాలం.. ఎలాంటి పని చేశాడో తెలిస్తే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆయన పేరు కేశవులు.. బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం చేసి రిటైర్‌ అయ్యాడు. ఖాళీగా ఉండడం.. సర్కిల్‌ ఏర్పడడంతో ఇంకా ఏదో చేయాలన్న ఆలోచన కలిగింది. పాల్వంచకు చెందిన ఓ మహిళ ప్రోద్బలంతో ఇద్దరూ కలసి ఒక పథకం పన్నారు. టెన్త్‌ క్లాస్‌, ఇంటర్‌ చదివిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికారు.

ఇంకా చదవండి ...
  ఖమ్మం: ఆయన పేరు కేశవులు.. బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం చేసి రిటైర్‌ అయ్యాడు. ఖాళీగా ఉండడం.. సర్కిల్‌ ఏర్పడడంతో ఇంకా ఏదో చేయాలన్న ఆలోచన కలిగింది. పాల్వంచకు చెందిన ఓ మహిళ ప్రోద్బలంతో ఇద్దరూ కలసి ఒక పథకం పన్నారు. టెన్త్‌ క్లాస్‌, ఇంటర్‌ చదివిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికారు. గ్రామాల్లో అక్కడక్కడా ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. ఏటా పోలీసు ఉద్యోగాలు వేల సంఖ్యలో ఇస్తున్న విషయాన్ని ఆసరాగా చేసుకుని జాబ్‌ గ్యారెంటీ స్కీం పెట్టేశారు. దీనికి తోడు కోర్టుల్లో కూడా రికార్డు అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, ఇంకా స్టెనోగ్రాఫర్‌ పోస్టులు ఇప్పిస్తామంటూ నమ్మబలికారు. అక్కడ ఆ ఊళ్లో ఫలానా వాళ్ల అబ్బాయికి ఇప్పించాము. ఇక్కడ ఈ ఊళ్లో వాళ్ల అమ్మాయికి ఇప్పించామంటూ ఉదాహరణలతో సహా చెప్పడంతో చాలామంది నమ్మారు. పైగా పిల్లలు సెటిల్‌ అవుతారన్న నమ్మకం, ఆశతో తల్లిదండ్రులు ఏ మాత్రం అనుమానం వ్యక్తం చేయకుండా సొమ్ము చెల్లించేశారు. ఇలా ఒక్కొక్కరి నుంచి మూడు లక్షల నుంచి మొదలై ఐదు లక్షల దాకా వసూలు చేశారు. వసూలుకు సూత్రధారి, ప్రధాన పాత్రధారి అయిన కేశవులు ఆ ప్రాంతంలో చాలా కాలం నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌లో చేసిన వ్యక్తి కావడంతో సహజంగానే అతన్ని అందరూ నమ్మేశారు. దీంతో ఇలా ఈ సంఖ్య వందల్లోనే ఉంటుందని బాధితులు చెబుతున్నారు. ఈ విషయం వెలుగులోకి వచ్చే దాకా ఎవరికీ చెప్పవద్దని, చెబితే పనికాదని షరతు విధించారని బాధితులు ఆరోపిస్తున్నారు.

  ఇలా ఈ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బయలుదేరిన వ్యక్తులు ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలోనే వందల సంఖ్యలో ఉన్నారంటే ఇక వసూళ్లు ఏ స్థాయిలో నడిచాయి.. ఎంత మొత్తం చేతులు మారాయన్నది అర్థం చేసుకోవచ్చు. అశ్వారావుపేటలోని ఓ పేపర్‌ మిల్లులో పనిచేస్తున్న కుటుంబంలో ఏకంగా ఐదుగురికి కోర్టుల్లో జాబు ఇప్పిస్తామని వారి నుంచి రూ.10 లక్షలు కొట్టేశారు. ఇంకా అశ్వారావుపేటలోనే ఖమ్మం రోడ్డులో నివాసం ఉండే మరో ముగ్గురి నుంచి రూ.6 లక్షలు వసూలు చేశారు. ఇంకా బండి సుబ్రమణ్యంనగర్‌ నుంచి పేరాయిగూడెం వెళ్లే మార్గంలో ఉండే కాలనికీ చెందిన యువకుడి నుంచి రెండు లక్షలు వసూలు చేశారు. అశ్వారావుపేటలోనే డ్రైవర్‌ కాలనీ, బీసీ కాలనీ, బెస్త కాలనికీ చెందిన పది మంది యువకుల నుంచి రూ.20 లక్షలు వసూలు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉన్న బాధితుల లిస్టు ఇప్పడిప్పుడే బయటపడుతోంది. దీంతో కొందరు బాధితులు ధైర్యంగా ముందుకెళ్లి పలుమార్లు కేశవులు ఇంటికెళ్లి అడిగారు. ఎప్పుడు అడిగినా ఇంకా ప్రాసెస్‌లోనే ఉందంటూ అతను పలుమార్లు వీళ్లను మోసం చేశాడు. మొత్తానికి కొద్ది రోజుల క్రితం ఏకమైన బాధితులు కొందరు అక్కడికి వెళ్లి ప్రశ్నించగా.. తాను కేవలం నిమిత్త మాత్రడినేనని... ఇలా వసూలు చేసిన సొమ్ములో కొంత మొత్తమే తనకు దక్కుతుందని, పాల్వంచకు చెందిన ఓ మహిళ, ఇంకా హైదరాబాదుకు చెందిన ఓ రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి పేరు చెప్పాడు. తనపైన రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతుండడంతో కేశవులు సడన్‌గా గుండెనొప్పి అంటూ విజయవాడ వెళ్లి ఓ ఆసుపత్రిలో చేరాడు.

  ఇది కూడా చదవండి: Mahabubnagar: రోడ్డు పక్కన బైక్ ఆపి భార్యతో ఫోన్ మాట్లాడుతుంటే ఎంతపని జరిగిందో చూడండి..

  దీంతో బాధితులంతా పోలీసు స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నారు. బాధితులంతా చిన్న, సన్నకారు రైతు కుటుంబాలే కావడంతో, తినీతినక దాచిపెట్టుకున్న కష్టార్జితం సొమ్ముతో ఎలాగైనా ఉద్యోగం పొందాలన్న వారి ఆశలు అడియాశలే అయ్యాయి. చివరకు మోసపోవడం.. ఉన్నది కాస్తా ఊడ్చుకుపోవడం ఇక్కడి విషాదం. ఇలా కోర్టుల్లో ఉద్యోగాలు నింపుతున్నట్టు తెలిసిన ప్రతిసారీ కొందరు ముఠాగా తయారు కావడం అమాయకుల ఆశలను అడ్డుపెట్టుకుని కోట్లకు కోట్లు కొల్లగొట్టడం సాధారణ విషయంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో ఆయా శాఖల్లో పెద్ద స్థాయిలో పనిచేస్తున్న వారి ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Crime news, Fake jobs, Khammam, Telangana crime news

  తదుపరి వార్తలు