Home /News /telangana /

BSF JAWAN CAME TO OWN VILLAGE AND COMMIT SUICIDE DUE TO A WOMAN HARASSMENT ABOUT MARRIAGE IN ADILABAD HSN

సెలవుపై సొంతూరికి వెళ్లి ఓ జవాన్ ఆత్మహత్య.. ఓ వివాహిత వేధింపులే కారణం..?

గెడాం మారుతి (ఫేస్ బుక్ ఫొటోలు)

గెడాం మారుతి (ఫేస్ బుక్ ఫొటోలు)

నన్ను మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండంటూ ఓ వివాహిత ఆ యువకుడి కుటుంబ సభ్యులను అడిగింది. ఆమెకు అంతకుముందే పెళ్లయింది. భర్తతో గొడవలు జరిగి వేరుగా ఉంటోంది. విడాకులు కూడా తీసుకోలేదు. ఆ యువకుడేమో ఆమెతో తనకు ఏం సంబంధం లేదన్నాడు. చివరకు..

ఇంకా చదవండి ...
    అతడో బీఎస్ఎఫ్ జవాన్. వయసు 30 ఏళ్లు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అందుకోసమే ప్రత్యేకంగా ఓ నెల రోజుల పాటు ఉద్యోగానికి సెలవులు పెట్టి మరీ సొంతూరికి వచ్చాడు. కుటుంబ సభ్యులు అతడికి పెళ్లి ప్రయత్నాలను మొదలు పెట్టారు. అయితే అనుకోకుండా వారికి ఓ మహిళ నుంచి ఊహించని వినతి ఎదురొచ్చింది. తనను మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండంటూ ఆ మహిళ యువకుడి కుటుంబ సభ్యులను అడిగింది. ఆమెకు అంతకుముందే పెళ్లయింది. భర్తతో గొడవలు జరిగి వేరుగా ఉంటోంది. విడాకులు కూడా తీసుకోలేదు. అసలు విషయం ఏంటా అని యువకుడిని అడిగితే తనకేం తెలియదని చెప్పాడు. ఆమెతో పెళ్లి తనకు ఇష్టం లేదన్నాడు. పెద్దమనుషుల పంచాయతీ పెట్టించాడు. అయినా ఆ వివాహిత తీరు మారకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. చివరకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అదిలాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    అదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని బెల్సరీ రాంపూర్ గ్రామానికి చెందిన గెడాం మారుతికి 30 ఏళ్ల వయసు. బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా మేఘాలయలోని 11వ బెటాలియన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. గత నెలలో ఉద్యోగానికి సెలవులు పెట్టి సొంతూరికి వచ్చాడు. ఇదే సమయంలో అతడికి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు కూడా పెళ్లి ప్రయత్నాలను మొదలుపెట్టారు. అయితే కొద్దిరోజులుగా ఓ వివాహిత అతడిని పెళ్లి చేసుకోమంటూ వేధిస్తోంది. ఓ బంధువు సాయంతో మారుతి కుటుంబ సభ్యులను కూడా అడిగించింది. ఓ వివాహిత నుంచి పెళ్లి ప్రపోజల్ రావడంతో మారుతి కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. మారుతిని విషయం అడిగితే, తనకేం తెలియదని చెప్పాడు. దీంతో వారు బుధవారం పెద్దమనుషుల మధ్య పంచాయతీ పెట్టారు. ఆ మహిళతో తనకు ఏం సంబంధం లేదనీ, ఆమెను తాను పెళ్లి చేసుకోనని మారుతి తేల్చిచెప్పాడు.

    అయితే ఆ వివాహిత మాత్రం ఏమాత్రం బెదిరిపోలేదు. తనను ఎలా పెళ్లి చేసుకోకుండా ఉంటావో చూస్తాననీ, పోలీస్ కేసు పెడతానని బెదిరించింది. దీంతో మనస్తాపానికి గురయిన మారుతి, బుధవారం రాత్రి 8గంటల సమయంలో బయటపడుకుంటానని చెప్పి, ట్రాక్టర్ లో ఉన్న పురుగుల మందు తాగాడు. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించేలోపే మారుతి మృతి చెందాడు. ఈ ఘటనపై మారుతి సోదరుడు సుదర్శన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Crime story, Husband kill wife, Wife kill husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు