ఓవైపు తెలంగాణలో రాజకీయాలు చూసుకుంటూనే.. మరోవైపు జాతీయ రాజకీయాల్లో తన ప్రయాణాన్ని సాగిస్తూ ముందుకుపోతోంది BRS. ఇందులో భాగంగానే ఇవాళ.. మహారాష్ట్రలో రెండోసారి సభను నిర్వహిస్తోంది. కాందార్ లోహాలోని బైల్ బజార్‌లో జరిగే ఈ సభకు లక్ష మంది దాకా వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేశాయి.
కుంభ స్థలాన్ని కొట్టాలంటే.. ముందు సరిహద్దుల్లో గెలవాలని చాణక్యుడు ఎప్పుడో చెప్పాడు. బీఆర్ఎస్ కూడా అదే వ్యూహాన్ని అమలుచేస్తోంది. ముందుగా తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలపై ఫోకస్ పెడుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై వ్యూహాలు రచిస్తూనే.. మరోవైపు తెలంగాణకు సపోర్ట్ ఇస్తున్న మహారాష్ట్రలో దూసుకెళ్లేలా అడుగులు వేస్తోంది.
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రజలు బీఆర్ఎస్‌కి మద్దతు ఇస్తున్నారు. రైతుబంధు, దళితబంధు, రైతు బీమా, రుణమాఫీ లాంటి పథకాలు తమకూ కావాలని కోరుతున్నారు. అందుకే బీఆర్ఎస్... నాదేండ్‌లో సభను విజయవంతం చేసినట్లే.. ఇవాళ్టి సభను కూడా సక్సెస్ చెయ్యాలని భావిస్తోంది.
All set for BRS public meeting at Maharashtra’s Khandar Loha on March 26.. This is the second public meeting of the @BRSparty in Maharashtra after it forayed into national politics pic.twitter.com/PrC5TkqV7J
— Sarita Avula (@SaritaTNews) March 25, 2023
ఈ సభలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ .. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి వెళ్లనున్నారు. దాదాపు 15 ఎకరాల్లో ఈ సభను ఏర్పాటుచేశారు. ఇంత భారీ సభను ఏర్పాటు చేయడంతో పార్టీ వర్గాల్లో ఆనందోత్సాహాలు ఉన్నాయి. ఈ సభలో ప్రతీ దృశ్యమూ అందరికీ కనిపించేలా.. మొబైల్ వెహికిల్స్‌తో వీడియో స్క్రీన్లను ఏర్పాటుచేశారు.
తెలంగాణలో పథకాలను మహారాష్ట్రలోనూ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. జాతీయ పార్టీగా అవతరించేందుకు మహారాష్ట్రలో రాజకీయాలు వీలు కల్పిస్తున్నాయని కేసీఆర్ భావిస్తున్నారు. ముందుగా మహారాష్ట్రలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను బరిలో దింపాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Telangana News