ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో విచారణ ఎదుర్కొంటున్న కవిత.. గత 10 గంటల నుంచి ఈడీ కార్యాలయంలోనే ఉండటంతో అంతకంతకూ టెన్షన్ పెరుగుతోంది. సాయంత్రం సమయంలో వైద్యుల బృందంతో పాటు పలువురు న్యాయనిపుణులు కూడా ఈడీ కార్యాలయానికి వెళ్లారు. దీంతో ఈ కేసు విషయంలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ పెరిగిపోయింది. కాసేపటికి వైద్యులు వెళ్లిపోయారు. కవిత మరికాసేపట్లోనే బయటకు వస్తారనే వార్తలు వచ్చాయి. మార్చి 11న ఈడీ విచారణకు హాజరైన కవిత.. అప్పుడు 8 గంటల సమాయానికి బయటకు వచ్చేశారు. కానీ నేడు ఈడీ కార్యాలయంలోకి వెళ్లి 10 గంటలు పూర్తయినా.. ఆమె ఇంతవరకు బయటకు రాకపోవడం.. ఈడీ కార్యాలయం దగ్గర పోలీసులు బందోబస్తును పెంచడం వంటి పరిణామాలు అక్కడ ఉన్న టెన్షన్ వాతావరణాన్ని మరింతగా పెంచేస్తున్నాయి.
మరోవైపు కవిత కోసం ఈడీ ఆఫీసుకు వెళ్లిన పలువురు న్యాయవాదులు ఇప్పటికీ విజిటర్స్ ఛాంబర్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని అక్కడ ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు తెలంగాణలోని బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
అంతకుముందు ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవితను మొదట ఈ కేసులో నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి ముఖాముఖి విచారించారు అధికారులు. సౌత్ గ్రూప్‌తో లింకులకు సంబంధించి వివరాలను రాబట్టారు. నేడు పిళ్లై కస్టడీ ముగియడంతో ఢిల్లీ స్పెషల్ కోర్టుకు తరలించారు. కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో పిళ్లైను తీహార్ జైలుకు తరలించారు. ఏప్రిల్ 3వ తేదీ వరకు పిళ్లై కస్టడీలోనే ఉండనున్నారు. పిళ్లై వెళ్లిపోయాక సాయంత్రం నుంచి కవిత ఒక్కరినే ప్రశ్నించినట్లు అంతా భావించారు.
హైదరాబాద్‌లో భారీగా పెరగనున్న మామిడి పండ్ల ధరలు.. ఇదే కారణం.. !
KTR: అవన్నీ ప్రజలకు వివరించండి.. బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ పిలుపు.. పార్టీ ప్లీనరీపై క్లారిటీ
అయితే ఈ కేసులో నిందితులైన అమిత్ అరోరా, మనీశ్ సిసోడియాలతో కలిపి సాయంత్రం నుంచి కల్వకుంట్ల కవితను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈడీకి కవిత తరపు న్యాయవాదుల బృందం చేరుకోగా.. జోరుగా వాన పడుతున్నా లెక్క చేయకుండా బీఆర్‌ఎస్ కార్యకర్తలు బయట ఎదురు చూపులు చూస్తున్నారు. ఈ తరుణంలో బయట భారీగా పోలీసులు మోహరించడంతో.. అక్కడ ముందుముందు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kalvakuntla Kavitha, Telangana