హోమ్ /వార్తలు /తెలంగాణ /

Kalvakuntla Kavitha: ఉత్కంఠకు తెర.. ముగిసిన కవిత ఈడీ విచారణ.. రేపు మరోసారి రావాలని నోటీసులు

Kalvakuntla Kavitha: ఉత్కంఠకు తెర.. ముగిసిన కవిత ఈడీ విచారణ.. రేపు మరోసారి రావాలని నోటీసులు

కవిత (ఫైల్ ఫోటో)

కవిత (ఫైల్ ఫోటో)

Kavitha: కార్యాలయం నుంచి చిరునవ్వుతోనే బయటకు వచ్చిన కవిత.. కారులో కూర్చున తరువాత విక్టరీ చిహ్నం చూపించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. పది గంటలకు పైగా విచారణను ఎదుర్కొన్న కవిత(Kalvakuntla Kavitha).. కొద్దిసేపటి క్రితం ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. ఆమె సొంత కాన్వాయ్‌లో ఢిల్లీలోని సీఎం కేసీఆర్(Kcr) నివాసానికి బయలుదేరి వెళ్లారు. కార్యాలయం నుంచి చిరునవ్వుతోనే బయటకు వచ్చిన కవిత.. కారులో కూర్చున్న తరువాత విక్టరీ చిహ్నం చూపించారు. దీంతో ఈ రోజు విచారణ సందర్భంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఉత్కంఠకు తెరపడింది. అంతకుముందుకు ఈడీ కార్యాలయం(ED Office) దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కవిత ఈడీ కార్యాలయంలోనే ఉండటంతో ఏం జరగబోతోందనే టెన్షన్ పెరిగిపోయింది. కవిత మరికాసేపట్లోనే బయటకు వస్తారని అంటున్నా.. అనూహ్య పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటాయేమో అనే ఆందోళన బీఆర్ఎస్ నేతలు, శ్రేణుల్లో కనిపించింది.

అందుకు తగ్గట్టుగానే ఈడీ కార్యాలయం ఆవరణలో ఉన్న పార్టీ శ్రేణులను బయటకు పంపించడం.. అక్కడ బందోబస్తును పెంచడంతో టెన్షన్ మరింతగా పెరిగిపోయింది. కానీ 9 గంటల సమయంలో ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కవిత.. తన కాన్వాయ్‌లో ఢిల్లీలోని తుగ్లక్ రోడ్‌లో ఉన్న సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. దీంతో అప్పటివరకు టెన్షన్‌లో ఉన్న బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కేసు విచారణలో భాగంగా రేపు కూడా ఈడీ కార్యాలయానికి రావాలని ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11.30 గంటలకు విచారణకు రావాల్సిందిగా కోరింది. అయితే రేపటి విచారణకు కవిత హాజరవుతారా ? లేదా ? అన్నది రేపు ఉదయం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

అంతకుముందు ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవితను మొదట ఈ కేసులో నిందితుడిగా ఉన్న అరుణ్‌ రామచంద్ర పిళ్లైతో కలిపి ముఖాముఖి విచారించారు అధికారులు. సౌత్‌ గ్రూప్‌తో లింకులకు సంబంధించి వివరాలను రాబట్టారు. నేడు పిళ్లై కస్టడీ ముగియడంతో ఢిల్లీ స్పెషల్‌ కోర్టుకు తరలించారు. కోర్టు జ్యుడిషియల్‌ కస్టడీ విధించడంతో పిళ్లైను తీహార్‌ జైలుకు తరలించారు. ఏప్రిల్‌ 3వ తేదీ వరకు పిళ్లై కస్టడీలోనే ఉండనున్నారు. పిళ్లై వెళ్లిపోయాక సాయంత్రం నుంచి కవిత ఒక్కరినే ప్రశ్నించినట్లు అంతా భావించారు.

హైదరాబాద్‌లో భారీగా పెరగనున్న మామిడి పండ్ల ధరలు.. ఇదే కారణం.. !

KTR: అవన్నీ ప్రజలకు వివరించండి.. బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ పిలుపు.. పార్టీ ప్లీనరీపై క్లారిటీ

అయితే ఈ కేసులో నిందితులైన అమిత్‌ అరోరా, మనీశ్‌ సిసోడియాలతో కలిపి సాయంత్రం నుంచి కల్వకుంట్ల కవితను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈడీకి కవిత తరపు న్యాయవాదుల బృందం చేరుకోగా.. జోరుగా వాన పడుతున్నా లెక్క చేయకుండా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బయట ఎదురు చూశారు. ఎట్టకేలకు 9 గంటల సమయంలో కవిత బయటకు రావడంతో అంతా రిలాక్స్ అయ్యారు.

First published:

Tags: Kalvakuntla Kavitha, Telangana

ఉత్తమ కథలు