హోమ్ /వార్తలు /తెలంగాణ /

MLC Kavitha : మూడోసారి ED ఆఫీసుకు కవిత.. ఫోన్లను ప్రదర్శించిన ఎమ్మెల్సీ

MLC Kavitha : మూడోసారి ED ఆఫీసుకు కవిత.. ఫోన్లను ప్రదర్శించిన ఎమ్మెల్సీ

ఎమ్మెల్సీ కవిత (File image credit - twitter - ANI)

ఎమ్మెల్సీ కవిత (File image credit - twitter - ANI)

MLC Kavitha : తెలంగాణ ఎమ్మెల్సీ కవితను మూడోసారి ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు ఈడీ అధికారులు. ఇవాళ మళ్లీ ఆమె ఆఫీసుకి వెళ్లారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న BRS ఎమ్మెల్సీ కవిత ఇవాళ మూడోసారి ఉదయం 11.30కి ఈడీ ఆఫీసులోకి వెళ్లారు. వెళ్లే ముందు ఆమె... సీఎం కేసీఆర్ ఇంటి నుంచి ఈడీ ఆఫీసుకు బయలుదేరుతూ... మీడియాకి తన ఫోన్లను ప్రదర్శించారు.

ఎమ్మెల్సీ కవిత.. రెండు సిమ్‌లను వాడి... దాదాపు 10 ఫోన్లను మార్చారని తెలుస్తోంది. ఆ ఫోన్లను ధ్వంసం చేశారనే ప్రచారం జరిగింది. ఆ ఫోన్లను తీసుకురావాలని ఈడీ అధికారులు కోరడంతో.. ఆమె ఈ ఫోన్లను తీసుకెళ్లారని తెలిసింది. ఈ ఫోన్లను మీడియాకి ప్రదర్శించడం ద్వారా.. ఈడీ అధికారులు ఈ ఫోన్లను తెమ్మన్నారని ఆమె పరోక్షంగా చెప్పినట్లైంది.

ఈడీ ఆఫీసుకి వెళ్లేముందు కవిత... తన లాయర్లను సంప్రదించారు. ఆ తర్వాత ఈడీ ఆఫీసుకి వెళ్లారు. ఐతే.. ఆమె ఫోన్లను నాశనం చేయలేదని తెలిపేందుకే మీడియా ముందు ప్రదర్శన చేశారని తెలుస్తోంది.

ఈ కేసులో 36 మంది 170 ఫోన్లను వాడినట్లు ఆరోపణలున్నాయి. వాటిలో 17 ఫోన్లను ఈడీ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈ కేసులో ఈడీకి లేఖ రాసిన కవిత.. ఈ కేసును రాజకీయ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారని ఆరోపించారు. తనను కావాలని ఈ కేసులో ఇరికిస్తున్నారని కవిత ఆరోపించారు. తాను ఏ ఫోన్లనూ ధ్వంసం చేయలేదన్న కవిత.. తన పాత ఫోన్లన్నీ ఈడీకి ఇచ్చేస్తున్నా అని తెలిపారు.

First published:

ఉత్తమ కథలు