హోమ్ /వార్తలు /తెలంగాణ /

MLC Kavitha : నేడు ED ముందుకు కవిత.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై విచారణ

MLC Kavitha : నేడు ED ముందుకు కవిత.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై విచారణ

ఎమ్మెల్సీ కవిత (File image credit - twitter - ANI)

ఎమ్మెల్సీ కవిత (File image credit - twitter - ANI)

MLC Kavitha : తెలంగాణ ఎమ్మెల్సీ కవితను మరోసారి ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు సిద్ధమయ్యారు. మరి ఆమె ఇవాళ ఈడీ ముందుకు వస్తారా రారా అన్నది తేలాల్సి ఉంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారుల ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరు కావాల్సి ఉంది. ఇంతకు ముందు మార్చి 16న ఇలాగే హాజరుకావాల్సి ఉన్నా.. ఆమె తన బదులుగా తన లాయర్‌ను పంపారు. దాంతో.. ఈడీ అధికారులు ఆమెకు మరోసారి నోటీస్ పంపారు. మార్చి 20న వ్యక్తిగతంగా హాజరుకావాలని తెలిపారు. దాంతో.. నిన్న ఢిల్లీ వచ్చిన కవిత.. ఇవాళ వ్యక్తిగతంగా హాజరవుతారని తెలుస్తోంది. దీనిపై బీఆర్ఎస్ వర్గాల నుంచి అధికారిక సమాచారం ఏదీ రాలేదు.

నిన్న ప్రత్యేక విమానంలో బేగంపేట్ నుంచి ఢిల్లీ వెళ్లిన కవితతో పాటు ఆమె భర్త అనిల్, మంత్రి కేటీఆర్ , రాజీవ్ సాగర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర తదితరులు వెళ్లారు. ప్రస్తుతం వారంతా ఢిల్లీ.. తుగ్లక్ రోడ్డులోని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంట్లో ఉన్నారు.

ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్ళై ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగుస్తుంది. తమ కస్టడీలో ఉన్న పిళ్ళైని... వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు, ఎమ్మెల్సీ కవితతో కలిపి ప్రశ్నించాల్సిన అవసరం ఉందని స్పెషల్ కోర్టుకు ఇదివరకు ఈడీ తెలిపింది. ఐతే.. వారం రోజులు పిళ్లై కస్టడీలో ఉన్నా... ఆ సమయంలో మాగుంట శ్రీనివాసులు, కవిత ఈడీ ముందుకు రాలేదు. అందువల్ల ఇవాళ కవిత, పిళ్లైని కలిపి ప్రశ్నిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఐతే.. ఇవాళ పిళ్ళైని స్పెషల్ కోర్టులో హాజరు పర్చనుంది ఈడీ.

ఇక ఓ మహిళను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. తన ఆఫీసుకి పిలిచి విచారించడం సరికాదంటూ... మహిళలకు ప్రత్యేక మినహాయింపులు ఉండాలంటూ... తనకు ఈడీ విచారణ నుంచి మధ్యంతర రిలీఫ్ ఇవ్వాలని కోరుతూ.. కవిత వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు 24న విచారణ జరపనుంది. ఈ విచారణలోపే కవితను ప్రశ్నించాలని ఈడీ కోరుకుంటోంది.

రూల్స్ ప్రకారం చూస్తే... సీబీఐ దర్యాప్తులో... తాము ప్రశ్నించాలనుకున్న వారిని సీబీఐ ఎక్కడికి రావాలో అడుగుతుంది. వారు చెప్పిన చోటికే సీబీఐ అధికారులు వెళ్లి ప్రశ్నిస్తారు. ఈడీ విషయంలో అలా జరగదు. ఈడీ అధికారులు చెప్పిన చోటికే... నిందితులు వెళ్లి... విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మహిళలకు మినహాయింపులు ఏవీ లేవు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆల్రెడీ ఎమ్మెల్సీ కవితను మార్చి 11న దాదాపు 10 గంటలు ప్రశ్నించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇవాళ మరోసారి ప్రశ్నించనున్నారు. కవితకు తాను బినామీని అని హైదరాబాద్ వ్యాపారి రామచంద్ర పిళ్లై చెప్పడంతో... ఆ స్టేట్‌మెంట్ ఆధారంగా ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఐతే.. వారికి మరిన్ని అనుమానాలు ఉండటంతో.. మరోసారి రావాల్సి ఉంటుందని తెలిపారు.

First published:

Tags: Kalvakuntla Kavitha, Kavitha

ఉత్తమ కథలు