Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న BRS ఎమ్మెల్సీ కవితను నిన్న 10 గంటలకు పైగా ప్రశ్నించిన ఈడీ అధికారులు.. మళ్లీ ఇవాళ రావాల్సిందిగా సమన్లు పంపారు. అందువల్ల కవిత ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకి రావాల్సిందిగా సమన్లు పంపినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
నిన్న ఉదయం 10.30కే ఈడీ ఆఫీసుకి వచ్చారు కవిత. అప్పటి నుంచి రాత్రి 9 గంటల వరకూ ఆమె ఈడీ ఆఫీసులోనే ఉండాల్సి వచ్చింది. లోపల ఆమెను విడిగా ప్రశ్నించారా లేక ఇతర నిందితులతో కలిపి ప్రశ్నించారా అనే దానిపై అధికారిక సమాచారం లేకపోవడంతో... ఒక్కో మీడియా ఒక్కోలా కథనాలు ఇస్తోంది. లోపల ఏం జరిగింది అన్నది మాత్రం ఎవరికీ కచ్చితంగా తెలియదు. రాత్రి 9 తర్వాత కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. తన సొంత కాన్వాయ్‌లో ఢిల్లీలోని తుగ్లక్ రోడ్‌లో ఉన్న సీఎం కేసీఆర్(Kcr) ఇంటికి వెళ్లారు.
#WATCH | Delhi: BRS MLC K Kavitha leaves from ED office. She arrived at the ED office earlier today after the agency summoned her in connection with the Delhi liquor policy case. pic.twitter.com/beIs8v2yW1
— ANI (@ANI) March 20, 2023
కవిత ఈడీ ఆఫీసుకి వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడూ చిరునవ్వుతోనే ఉంటున్నారు. తద్వారా లోపల ఏమీ లేదు. తనకేమీ ఇబ్బంది లేదు అనేలా సంకేతాలు ఇస్తున్నారు. ప్రతిపక్షాలు మాత్రం.. అన్ని గంటలపాటూ ప్రశ్నిస్తున్నారంటే.. ఏమీ లేకుండా ఎందుకుంటుంది? కవిత కచ్చితంగా పెద్ద నేరమే చేశారని ఆరోపిస్తున్నాయి.
ఇవాళ కవిత విచారణకు కవిత హాజరవుతారా ? లేదా ? అన్నది ఇవాళ ఉదయం తెలిసే అవకాశం ఉంది. ఆమె ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి.. హాజరవుతారనే ప్రచారం జరుగుతోంది.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు, మద్యం వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైకి ఈడీ కస్టడీ నిన్నటితో ముగిసింది. నిన్న ఆయన్ని ఈడీ అధికారులు... ఢిల్లీ స్పెషల్ కోర్టుకు తరలించారు. కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో పిళ్లైని తీహార్ జైలుకి పంపారు. ఏప్రిల్ 3వ తేదీ వరకు పిళ్లై జ్యుడీషియల్ కస్టడీలో ఉంటారు. నిన్న ఉదయం కవితను పిళ్లైతో కలిపి కూర్చోబెట్టి ప్రశ్నించారని కొందరు, లేదు అని మరికొందరు అంటున్నారు. ఇలాంటి అంశాలపై అధికారిక ప్రకటనలను నమ్మడమే మేలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BRS, CM KCR, Delhi liquor Scam, Kalvakuntla Kavitha, Kavitha, Kcr, MP Kavitha