హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: ఎమ్మెల్యేల ఎర కేసు..సర్కార్ కు సుప్రీం కీలక ఆదేశాలు..తదుపరి విచారణ ఎప్పుడంటే?

Telangana: ఎమ్మెల్యేల ఎర కేసు..సర్కార్ కు సుప్రీం కీలక ఆదేశాలు..తదుపరి విచారణ ఎప్పుడంటే?

సుప్రీంకోర్టు (File Image)

సుప్రీంకోర్టు (File Image)

BRS MLAs Poaching Case: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అక్టోబర్ 26న బయటకొచ్చిన ఈ కేసులో కొత్త కొత్త విషయాలు బయటకొచ్చాయి. ఇక కేసు దర్యాప్తుకై సర్కార్ సిట్ కు బాధ్యతలు అప్పగించింది. అయితే ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో సీబీఐకి దర్యాప్తు బాధ్యతలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు గతంలో స్పష్టం చేసింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తుపై స్టే ఇవ్వాలని అలాగే సిట్ దర్యాప్తు కొనసాగించేలా ఆదేశాలివ్వాలని పేర్కొంది. తాజాగా ఈరోజు పిటీషన్ పై విచారణ జరిగింది. ఈ క్రమంలో కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

BRS MLAs Poaching Case: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అక్టోబర్ 26న బయటకొచ్చిన ఈ కేసులో కొత్త కొత్త విషయాలు బయటకొచ్చాయి. ఇక కేసు దర్యాప్తుకై సర్కార్ సిట్ కు బాధ్యతలు అప్పగించింది. అయితే ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో సీబీఐకి దర్యాప్తు బాధ్యతలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు గతంలో స్పష్టం చేసింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తుపై స్టే ఇవ్వాలని అలాగే సిట్ దర్యాప్తు కొనసాగించేలా ఆదేశాలివ్వాలని పేర్కొంది. తాజాగా ఈరోజు పిటీషన్ పై విచారణ జరిగింది. ఈ క్రమంలో కీలక ఆదేశాలు జారీ చేసింది.

పేపర్ లీక్..గాంధీభవన్ దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు

గత విచారణ సందర్బంగా సీబీఐ విచారణ ఆపేయాలని ఆదేశాలు ఇచ్చారు కానీ నోటీసులు ఇవ్వలేదని కోర్టుకు తెలియజేయగా సర్కార్ కు మినహా అటు సీబీఐకి ఇటు ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ కేసు దర్యాప్తును సిట్ కూడా నిలిపేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో తరువాత విచారణను జూలై 31కు వాయిదా వేసింది. అయితే దాదాపు అప్పటివరకు అటు సీబీఐ ఇటు సిట్ కూడా విచారణ చేసే అవకాశం లేకపోయింది.

Telangana: హైదరాబాద్ గన్ పార్క్ వద్ద హైటెన్షన్..బండి సంజయ్ , ఈటెల అరెస్ట్

కాగా గతంలో సుప్రీంకోర్టులో విచారణ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం తరపున దుశ్యంత్ దవే వాదనలు వినిపించారు. ఈ కేసులో వాదనలు వినిపించడానికి ఎక్కువ సమయం కావాలని దవే కోర్టును కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి సిట్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆధారాలన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) దృష్టికి దుశ్యంత్ దవే తీసుకొచ్చారు. కేసులో ఆధారాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని అలాంటప్పుడు దర్యాప్తును సీబీఐకి ఎలా అప్పగిస్తారని దవే ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బీజేపీ యత్నించిందని అన్నారు. ఐటీ, సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసులకు సంబంధించి వివరాలు మీడియాకు లీకు చేస్తున్నారని ఈ విషయం కోర్టు దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు తీర్పు అమలుపై స్టే ఇవ్వాలని దవే కోరారు.

ఇక బీజేపీ తరపున మహేష్ జటల్మని వాదనలు వినిపించారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు పారదర్శకంగా లేదు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైందని అన్నారు. ఈ కేసుకు సంబంధించిన అంశాలు దేశ వ్యాప్తంగా అందరికి అందాయని గుర్తు చేయగా..జస్టిస్ గవాయ్ కల్పించుకొని ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు పెన్ డ్రైవ్ లో తమకు చేరాయని అన్నారు. ఈ క్రమంలో తాజాగా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

First published:

Tags: High Court, Supreme Court, Telangana, TRS MLAs Poaching Case

ఉత్తమ కథలు