BRS MLAs Poaching Case: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసు అనేక మలుపులు తిరుగుతుంది. ఈ కేసును దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మొదట సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం)ను ఏర్పాటు చేసింది. అయితే సిట్ విచారణ ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతుందని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో విచారణ జరిపిన హైకోర్టు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. హైకోర్టు (High Court) ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరిగింది. విచారణ అనంతరం సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసుపై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను జూలై 31కి వాయిదా వేసింది. అప్పటివరకు కూడా కేసు దర్యాప్తుపై స్టే ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున జూలై 31 వరకు కూడా దర్యాప్తుపై స్టే విధించాలనే నిబంధన ఉంది. తదుపరి విచారణ వరకు ఈ కేసుకు సంబంధించిన రికార్డులను సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది.
గతంలో సుప్రీంలో విచారణ..
కాగా గత నెల 17న కూడా సుప్రీంకోర్టులో ఈ కేసుపై విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తరపున దుశ్యంత్ దవే వాదనలు వినిపించారు. ఈ కేసులో వాదనలు వినిపించడానికి ఎక్కువ సమయం కావాలని దవే కోర్టును కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి సిట్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆధారాలన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) దృష్టికి దుశ్యంత్ దవే తీసుకొచ్చారు. కేసులో ఆధారాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని అలాంటప్పుడు దర్యాప్తును సీబీఐకి ఎలా అప్పగిస్తారని దవే ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బీజేపీ యత్నించిందని అన్నారు. ఐటీ, సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసులకు సంబంధించి వివరాలు మీడియాకు లీకు చేస్తున్నారని ఈ విషయం కోర్టు దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు తీర్పు అమలుపై స్టే ఇవ్వాలని దవే కోరారు.
ఇక బీజేపీ తరపున మహేష్ జటల్మని వాదనలు వినిపించారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు పారదర్శకంగా లేదు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైందని అన్నారు. ఈ కేసుకు సంబంధించిన అంశాలు దేశ వ్యాప్తంగా అందరికి అందాయని గుర్తు చేయగా..జస్టిస్ గవాయ్ కల్పించుకొని ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు పెన్ డ్రైవ్ లో తమకు చేరాయని అన్నారు. ఇక తాజాగా మరోసారి వాదనలు విన్న కోర్టు జూలై 31కి విచారణను వాయిదా వేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BRS, Highcourt, Hyderabad, Supreme Court, Telangana, TRS MLAs Poaching Case