హోమ్ /వార్తలు /తెలంగాణ /

BRS MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..వాడీవేడిగా వాదనలు..విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

BRS MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..వాడీవేడిగా వాదనలు..విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంలో విచారణ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంలో విచారణ

Telangana: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తును తెలంగాణ హైకోర్టు సీబీఐకి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ ను ఈనెల 7న దాఖలు చేయగా వెంటనే విచారణ చేయాలని పిటీషనర్ కోరారు. అయితే ఇప్పటికిప్పుడు విచారణ జరపలేమన్న కోర్టు విచారణను ఈరోజు (17న) జరుపుతామని పేర్కొంది. ఇక తాజాగా ఈ పిటీషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీం విచారణపై కీలక నిర్ణయం తీసుకుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

BRS MLAs Poaching Case |  ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తును తెలంగాణ హైకోర్టు సీబీఐకి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court) లో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ ను ఈనెల 7న దాఖలు చేయగా వెంటనే విచారణ చేయాలని పిటీషనర్ కోరారు. అయితే ఇప్పటికిప్పుడు విచారణ జరపలేమన్న కోర్టు విచారణను ఈరోజు (17న) జరుపుతామని పేర్కొంది. ఇక తాజాగా ఈ పిటీషన్ పై సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ జరిపింది. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీం తదుపరి విచారణను ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది. ఈ సందర్బంగా ఇద్దరు న్యాయవాదులు కీలక వాదనలు కోర్టు ముందు ఉంచారు.

Telangana: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుపై మరోసారి విమర్శలు .. స్వామిభక్తి తగదంటూ చురకలు

విచారణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తరపున దుశ్యంత్ దవే వాదనలు వినిపించారు. ఈ కేసులో వాదనలు వినిపించడానికి ఎక్కువ సమయం కావాలని దవే కోర్టును కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి సిట్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆధారాలన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) దృష్టికి దుశ్యంత్ దవే తీసుకొచ్చారు. కేసులో ఆధారాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని అలాంటప్పుడు దర్యాప్తును సీబీఐకి ఎలా అప్పగిస్తారని దవే ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బీజేపీ యత్నించిందని అన్నారు. ఐటీ, సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసులకు సంబంధించి వివరాలు మీడియాకు లీకు చేస్తున్నారని ఈ విషయం కోర్టు దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు తీర్పు అమలుపై స్టే ఇవ్వాలని దవే కోరారు.

హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో కీలక మలుపు..పాతబస్తీకి చెందిన కలీం అరెస్ట్!

ఇక బీజేపీ తరపున మహేష్ జటల్మని వాదనలు వినిపించారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు పారదర్శకంగా లేదు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైందని అన్నారు. ఈ కేసుకు సంబంధించిన అంశాలు దేశ వ్యాప్తంగా అందరికి అందాయని గుర్తు చేయగా..జస్టిస్ గవాయ్ కల్పించుకొని ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు పెన్ డ్రైవ్ లో తమకు చేరాయని అన్నారు. ఇకఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు (Supreme Court) తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.

మరి ఈ కేసు విచారణలో 27న సుప్రీంకోర్టు (Supreme Court) ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ నెలకొంది.

First published:

Tags: Supreme Court, Telangana, TRS MLAs Poaching Case

ఉత్తమ కథలు