• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • BROTHER WHO ACCUSED IN SEXUAL HARRASMENT ON HIS SISTER COMMITTED SUICID VS

Bad brother Suicide ; చెల్లెలి పై అత్యాచారానికి పాల్పడ్డ అన్నయ్య ...అత్యహత్య..

Bad brother Suicide ; చెల్లెలి పై అత్యాచారానికి పాల్పడ్డ అన్నయ్య ...అత్యహత్య..

ప్రతీకాత్మక చిత్రం

Brother suicide చెల్లెలి పై అత్యాచారానికి పాల్పడ్డ అన్నయ్య ...అత్యహత్య..మానవ సంబంధాలు మరిచిన అన్నయ్య పాపం పండింది.చెల్లెలి ఫిర్యాదుతో ఆందోళన, ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య

  • Share this:
పశువులా చెల్లెలుపై అత్యచారం చేస్తున్న అన్నయ్య పాపం పండింది .ఇన్నాళ్లు చెల్లెలిని బెదిరించి లొంగదీసుకున్న అన్న, అత్యాచారం విషయం పోలీసులకు చేరడంతో ఆందోళనకు గురయ్యాడు. అశ్రయం కోసం వచ్చిన చెల్లెలిపై చేసిన అఘాయిత్యానికి తానే తలవంచుకున్నాడు. అత్యాచారం చేసేటప్పడు గుర్తుకు రాని సమాజం, విషయం బయటకు రావడంతో నేరస్థుడయ్యాడు. అందుకే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేడు ఉదయం ఇంట్లో ఉరివేసుకుని తనువు చాలించాడు. అయితే  చెల్లెలిపై అత్యాచారం చేసిన స్వంత అన్నయ్య మాత్రం ఇంకా బతికే ఉన్నాడు.

భద్రాద్రి కొత్త గూడేంలో జరిగిన అమానవీయ సంఘటన కీలక మలుపు తీరిగింది. అభం శుభం తెలియని అమ్మాయిపై స్వంత అన్నయ్య తో పాటు పెద్దమ్మ కొడుకు కూడ అత్యాచారానికి పాల్పడుతున్నారు. చిన్నతనంలో చేసిన తప్పును ఇంకా కొనసాగిస్తునే ఉన్నారు. దీంతో భరించలేని అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది.  విషయం మీడియాలో ప్రముఖంగా ప్రచురణ అయింది. దీంతో అవమానికి గురయిన పెద్దమ్మ కొడుకు వరుసకు అన్నయ్య అయిన అజయ్  అనే యువకుడు నేడు ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 20 ఏళ్ల యువతి తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు. దీంతో తల్లి పెంచి పోషించింది. కాగా యువతికి ఓ అన్నయ్య కూడ ఉన్నాడు. అయితే ఆమె తొమ్మిదో తరగతి చదివేటప్పటి నుంచే అంటే సుమారు పది సంవత్సరాల క్రితం ఆమె అన్నయ్య లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. చివరికి అత్యాచారం చేయడం కూడ మొదలు పెట్టాడు. మరోవైపు ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించేవాడు. అప్పటి వరకు మణుగూరులో ఉన్న కుటుంభం అఘాయిత్యానికి పాల్పడిన అన్నయ్యకు ఉద్యోగం రావడంతో ఆ కుటుంబం అంతా కొత్తగూడెంకు వచ్చారు. అయినప్పటికీ అతడి తీరులో మాత్రం మార్పు రాలేదు. పెద్దది అయినా కూడ లైంగిక వేధింపులు కొనసాగుతుండడంతో కొత్తగూడెంలోనే ఉన్న పెద్దమ్మ వాళ్లింటికి వెళ్లింది. అక్కడి నుంచే ఇంటర్మీడియట్ చదువుకోవడం మొదలు పెట్టింది. అయితే ఆ ఇంట్లోనూ ఓ కామాంథుడు ఉన్నాడని ఆమె పసిగట్టలేకపోయింది. తన పెద్దమ్మ కోడుకు కూడ లైంగిక వేధింపులకు పాల్పడటం మొదలు పెట్టాడు. యువతిపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. అన్న చిత్రహింసలు భరించలేక పెద్దమ్మ తోపాటు పెద్దనాన్నలకు చెప్పింది. అయినా వారు పట్టించుకోలేదు. పైగా యువతిని నీచంగా చూశారు.

. ఈ క్రమంలోనే చదువు రూపంలో వీళ్ల నుంచి ఆమె కొన్నాళ్లయినా తప్పించుకుంది. మెడిసిన్ ఎంట్రన్స్ కోచింగ్ కోసం ఆ యువతి వేరే సిటీకి వెళ్లింది. అయితే లాక్ డౌన్ వల్ల మళ్లీ తిరిగి ఇంటికి రాక తప్పలేదు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్లీ అన్నయ్య అఘాయిత్యానికి బలయిపోతూనే ఉంది. విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో మళ్లీ కాలేజీకి వెళ్లింది. కొన్ని రోజుల వరకు ఆమె ప్రశాంతంగానే ఉన్నా.. ఇటీవల కాలేజీలకు సెలవులు ఇవ్వడంతో ఇంటికి వెళ్లాలంటేనే ఆమెకు భయం వేసింది. కాలేజీ నుంచి కొత్తగూడెంకు వచ్చిన ఆ యువతి చివరకు పోలీసులను ఆశ్రయించింది. తన వాళ్ల నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరింది. చిన్నప్పటి నుంచి ఆమె పడుతున్న బాధలను ఒక్కొక్కటిగా పోలీసులకు చెప్పింది. దీంతో ఈ విషయమై
కేసు నమోదు చేసుకున్నారు.

ఇక తనపై కేసు నమోదు కావడంతో  పోలీసులు రంగంలోకి దిగి నిందితున్ని అరెస్ట్ చేసేందుకు సిద్దమయ్యారు. దీంతో అత్యాచారానికి పాల్పడిన పెద్దమ్మ కొడుకు అజయ్ అందోళనకు గురయ్యాడు. ఇన్నాళ్లకు తన తప్పును తెలుసుకున్నాడు.భరించలేని తప్పును చేశానని అంతర్మధనం చెందాడు. ఈ నేపధ్యంలొనే బుధవారం ఉదయం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే స్వంత చెల్లెలిపై అఘాయిత్యం చేసిన అన్నయ్య మాత్రం ఇంకా తప్పించుకుని తిరుగుతున్నాడు.
Published by:yveerash yveerash
First published:

అగ్ర కథనాలు