Home /News /telangana /

BROTHER RAPED SISTER AND RECORDED VIDEO AFTER ARGUMENT ON RS 50 THOUSAND IN HYDERABAD HSN

సోదరుడి రూమ్ కు వెళ్లిన యువతి.. నిద్రలోంచి మెలకువ వచ్చి తిరిగి ఇంటికి.. రెండ్రోజుల తర్వాత వాట్సప్ లో వచ్చిన ఫొటోను చూసి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆ యువతి పిన్ని కుమారులు ఇద్దరు ఫిలింనగర్ లో ఉంటున్నారు. వీరు అప్పుడప్పుడు ఇళ్లకు వస్తూ పోతూ ఉండేవాళ్లు. వరుసకు సోదరులు కావడంతో ఆ యువతి వారితో బాగానే మాట్లాడేది. అయితే..

    స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. నిర్భయ, దిశ వంటి ఎన్నో కఠిన చట్టాలు చేస్తున్నప్పటికీ మృగాళ్లు మారడం లేదు. మరింత నిర్భయంగా దారుణాలకు తెగిస్తున్నారు. కాలేజీల్లోనో, పనిచేసే కార్యాలయాల్లోనే కాదు, చివరకు కుటుంబ సభ్యుల వద్ద కూడా స్త్రీలకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా జరిగిన ఓ ఘటన మానవ సంబంధాలకు మాయని మచ్చను తెచ్చి పెట్టింది. ఓ యువకుడు తన సోదరిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. లైంగిక దాడి చేశాడు. పైగా ఆ దృశ్యాలను వీడియో తీసి ఆమెకు వాట్సప్ లో పెట్టాడు. ఆమెకు బలవంతంగా మద్యం తాగించి మరీ అతడు ఈ దారుణానికి తెగించాడు. ఆమె భయంతో ముభావంగా ఉండటంతో కుటుంబ సభ్యులు నిలదీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    కర్ణాటకకు చెందిన దంపతులు తన ముగ్గురు కుమార్తెలతో కలిసి హైదరాబాద్ కు చాలా ఏళ్ల క్రితమే వచ్చారు. వారి రెండో అమ్మాయి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. అయితే ఆ యువతి పిన్ని కుమారులు ఇద్దరు ఫిలింనగర్ లో ఉంటున్నారు. వీరు అప్పుడప్పుడు ఇళ్లకు వస్తూ పోతూ ఉండేవాళ్లు. వరుసకు సోదరులు కావడంతో ఆ యువతి వారితో బాగానే మాట్లాడేది. అయితే ఈ ఇద్దరు సోదరుల్లో ఒకరు మార్చి 1వ తారీఖున ఆ యువతి వద్ద రూ.50వేలను అప్పుగా తీసుకున్నాడు. అదే రోజు మరో సోదరుడు ఫోన్ చేసి ‘నువ్వు ఇచ్చిన డబ్బుల వల్ల వాడు పాడయిపోతున్నాడు. అల్లరిచిల్లరగా తిరుగుతున్నాడు.‘ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఆ యువతి మార్చి 2వ తారీఖున ఆ సోదరులు ఉంటున్న రూమ్ కు వెళ్లింది. వారితో మాట్లాడంది. ఈ క్రమంలోనే ఇద్దరు సోదరులు గొడవపడి బయటకు వెళ్లిపోయారు.
    ఇది కూడా చదవండి: పెళ్లయి ఐదుగురు పిల్లలు ఉన్న మహిళ.. భర్తకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి.. ఇంటి ముందున్న గుంటలో బయటపడిన బండారం..!

    కొద్ది సేపటి తర్వాత డబ్బులు తీసుకున్న సోదరుడు రూమ్ కు వచ్చాడు. ఆమెకు బలవంతంగా మద్యం తాగించాడు. మద్యం మత్తులోనే ఆ యువతి నిద్రపోయింది. ఆ తర్వాత మెలకువ వచ్చాక ఇంటికి వెళ్లిపోయింది. మార్చి 4వ తారీఖున డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ సోదరుడికి ఫోన్ చేసింది. అయితే ఫోన్ కాల్ కట్ చేసిన తర్వాత వెంటనే ఆమెకు ఆ యువకుడు ఓ వాట్సప్ ఫొటోను పంపాడు. దాన్ని చూసిన ఆమె భయంతో సోదరుడికి ఫోన్ చేసింది. ‘మద్యం మత్తులో నువ్వు నిద్రపోతున్న సమయంలో నేను నీపై అత్యాచారం చేశాను. ఆ సమయంలో వీడియోను కూడా తీశాను. నువ్వు పదే పదే డబ్బులు అడిగితే బాగోదు. ఈ వీడియోను ఇంటర్నెట్ లో పెట్టేస్తా. మర్యాదగా అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ ఉండు‘ అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. కొద్ది రోజులుగా యువతి తీవ్ర ఆందోళనతో కనిపించడంతో తల్లిదండ్రులు నిలదీస్తే ఆమె అసలు విషయం చెప్పేసింది. దీంతో ఈ బుధవారం ఈ విషయమై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
    ఇది కూడా చదవండి: పెళ్లి పీటల వద్దకు వస్తూ.. సడన్ గా వెనక్కు వెళ్లిపోయిన వధువు.. కారణం తెలిసి నోరెళ్లబెట్టిన వరుడు.. చివరకు..
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Crime story, CYBER CRIME, Hyderabad, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు