Home /News /telangana /

Murder: ఆస్తి కోసం తమ్ముడిని చంపి.. నిజాంసాగర్ లో శవాన్ని పడేసి.. చివరకు..

Murder: ఆస్తి కోసం తమ్ముడిని చంపి.. నిజాంసాగర్ లో శవాన్ని పడేసి.. చివరకు..

పోలీస్ స్టేషన్

పోలీస్ స్టేషన్

Murder: ఈ విశ్వంలో ఏ పని చేయాలన్నా డబ్బుతో ముడిపడి ఉంటుంది. డబ్బుల కోసం ఎంతకైనా తెగించేవారు ఉన్నారు. అలాంటిదే ఆస్తి విషయంలో అన్నాదమ్ముళ్ల మధ్య గొడవ ఒకరి ప్రాణం తీసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    (పి. మ‌హేంద‌ర్, నిజామాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు)

    ఇద్ద‌రు కొడుకులు ఉంటే వారి ఒక‌రికొక‌రు తోడుగా ఉంటారు.. ఏ స‌మ‌స్య వ‌చ్చినా క‌లిసి ఎదుర్కొంటారని త‌ల్లిదండ్రుల అభిప్ర‌యం. కానీ ఆస్తి విష‌యానికి వ‌చ్చేస‌రికి ఎవ‌రి దారి వారిదే అన్న‌ట్ట‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ర‌క్త సంబందం, తోబుట్టువు, బంధువు అనే విషయాలను ఎవ‌రు లెక్క చేయడం లేదు. దీంతో ఆస్తి కంటే ఏదీ ఎక్కువ కాదు అన్న‌ట్టుగా ఉంది. తాజాగా తండ్రి ఆస్తి కోసం ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు గొడ‌వ‌ప‌డి ఒక‌రి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం ఆరేడు గ్రామానికి చెందిన గుర్ల సంగయ్య దంప‌తుల‌కు పెంటయ్య, పాండు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు పెంటయ్య పెళ్లి చేశాడు. చిన్న కొడుకు పాండుకు వివాహం జరగలేదు. పాండు చెడు వ్యసనాలకు బానిసై చిన్న చిన్న దొంగతనాలకు పాల్ప‌డుతూ జైలుకు వెళ్లాడు. ఈ మ‌ధ్య జైలు నుంచి బయటకు వచ్చాడు.

    అయితే తండ్రి సంగయ్య పేరు పై ఉన్న నాలుగు ఎకరాల భూమిని పెద్ద కొడుకు పెంటయ్య అతని భార్య పేరిట రెండు ఎక‌రాలు పట్టా చేసుకున్నాడు. మరో రెండు ఎకరాల భూమిని మేన బావ పేరున ప‌ట్టా చేయించాడు. దీంతో ఆగ్ర‌హించిన పాండు అన్నతో గొడవ పడ్డాడు. ఈ విషయమై రెండు రోజుల కిందట సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో గొడవకు దిగారు. అయితే పెంటయ్య దగ్గరి బంధువుతో కలిసి పాండుపై దాడి చేశాడు. అయితే పాండుకు తీవ్ర గాయాలు అయ్యి ప్రాణాలు కోల్పోయాడు. ఇది గ్ర‌హించిన పెంట‌య్య‌ అతడి శవాన్ని నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి లో తోసేసి ఆత్మ‌హ‌త్యగా చిత్రీక‌రించే ప్ర‌యత్నం చేశాడు.

    ఈ మధ్య నిజాంసాగర్ ప్రాజెక్టు 21వ గేటు ప్రాంతంలో మృతదేహం బయటపడటంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచార‌ణ చేప‌ట్టారు. అయితే ఆ పాండు మృత దేహం పై ఉన్న దెబ్బ‌ల‌ను చూసి పోలీసులు హ‌త్య‌గా గుర్తించారు. పోలీసులు వివరాలు ఆరా తీయగా విషయం బయటకు వచ్చింది. అయితే తన చిన్న కుమారుడు పాండు ను పెద్ద కుమారుడు పెంట‌య్య తో పాటు మేనబావ కలిసి దాడి చేసి హత్య చేసినట్లు తండ్రి సంగ‌య్య పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పెంట‌య్య‌, మేన‌బావ పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని తెలిపారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Attempt ot murder, Crime, Crime news, Murder, Nizamabad, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు