Home /News /telangana /

BRIDEGROOM WAS ARRSTED WHO WAS ACCUSED IN A MURDER CASE VRY

Nirmal : పెళ్లి నుండే నేరుగా కటకటాల్లోకి.. డీజే వివాదంలో పెళ్లికొడుకు అరెస్ట్...

పెళ్లి ఇంటివద్ద పోలీసులు

పెళ్లి ఇంటివద్ద పోలీసులు

Nirmal : కొత్త పెళ్లి కొడుకును అరెస్ట్ చేసి తీసుకువెళ్లే సంధర్భాలు ఎక్కువగా సనిమాల్లో చూసి ఉంటాము కాని రెండు కుటుంబాల మధ్య ఉన్న ఘర్షణతో ఓ యువకుని హత్యకు పరోక్షంగా కారణమైన ఓ పెళ్లి కొడుకుతో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేసిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది.

ఇంకా చదవండి ...
    పెళ్ళి ఇంట విందు వినోదాలతో సందడి ఉంటుంది. కాని అక్కడ పెళ్ళి ముచ్చట తీరకుండానే పెళ్ళి పీటల మీదినుండి పెళ్ళి కొడుకు నేరుగా కటకటాల్లోకి వెళ్ళిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. పాత కక్షలతో పెళ్ళి బారాత్ లోనే స్నేహితులతో కలిసి ఓ అమాయకుడిని హత్య చేసిన ఘటనలో పోలీసులు నిందితుడైన పెళ్ళి కొడుకును అరెస్టు చేశారు. పెళ్ళికొడుతోపాటు అతడి స్నేహితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఈ నెల 23వ తేదీన నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం కాల్వా తాండ గ్రామంలో రెండు పెళ్ళిళ్లు జరిగాయి. అయితే ఆ పెళ్ళిళ్ల సందర్భంగా నిర్వహించిన బారాత్ లో జరిగిన గొడవ హత్యకు దారితీసింది. కాల్వాతాండకు చెందిన మెగావత్ రాజు, బానావత్ సాయి కుమార్ వివాహం ఒకే రోజు లోకేశ్వరం మండలంలోని వేరు వేరు గ్రామాల్లో జరిగాయి. వివాహాల తర్వాత తమ గ్రామానికి తిరిగి వచ్చిన పెళ్ళివారు గ్రామంలో బారాత్ నిర్వహించారు. అయితే మెగావత్ రాజు, బానావత్ సాయి కుమార్ కుటుంబాల మధ్య కొన్ని సంవత్సరాల నుండి భూవివాదానికి సంబంధించిన పాత కక్షలు ఉన్నాయి.
    ఇక బారత్ లో భాగంగా సాయి కుమార్ తన మిత్రులను కూడా రప్పించుకొని మద్యం కూడా తాగించాడు. బారాత్ అనంతరం ఇంటికి చేరుకున్నాడు. అయితే రాజు బారాత్ తన బారాత్ కంటే బాగా జరగడంతో ఆగ్రహం చెందిన సాయికుమార్ వెళ్ళిపోయిన డిజె వాహనాన్ని మళ్ళి వెనక్కి రప్పించి డ్యాన్సు చేశాడు. కావాలని రాజు ఇంటి సమీపంలో తీసుకువెళ్ళి ఎక్కువ సౌండ్ పెట్టి స్నేహితులతో కలిసి నృత్యాలు చేశారు. అయితే సౌండ్ ఎక్కువ పెట్టడంతో రాజు బంధువైన మెగావత్ నవీన్ వారి వద్దకు వెళ్ళి కొద్దిగా సౌండ్ ను తగ్గించాలని కోరాడు.

    Yadadri : సాయంత్రం నుండే యాదాద్రికి భక్తులు.. ప్రధాన ఆలయం ప్రారంభోత్సవం..

    ఇప్పటికే రాజుపై కోపంతో ఉన్న సాయి కుమార్ పాత కక్షలను దృష్టిలో పెట్టుకొన్ని నవీన్ తో గొడవ పడ్డాడు. తన స్నేహితులతో కలిసి నవీన్ ను కిందపడేసి కాళ్ళతో తొక్కారు. దీంతో నవీన్ స్పృహ తప్పిపోయాడు. గమనించిన నవీన్ కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాని అప్పటికే నవీన్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు గ్రామంలోని సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నవీన్ మృతికి కారకుడైన సాయి కుమార్ తోపాటు అతని స్నేహితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. డి.ఎస్.పి ఉపేంద్ర రెడ్డి కేసు వివరాలను వెల్లడిస్తూ ఈ అరెస్టును ధృవీకరించారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Man arreste, Nirmal district

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు