BRIDE GROOM WAS MURDER BY LOVER OF BRIDE IN HUSNABAD VRY
Bride groom murder : ప్రియురాలికి కాబోయె భర్తను హత్య చేసిన ప్రియుడు..
ప్రతీకాత్మక చిత్రం
Bride groom murder : తాను ప్రేమించిన అమ్మాయి మరొకరిని పెండ్లి చేసుకునేందుకు సిద్దమవుతుండడంతో.. ప్రియుడు భరించలేకపోయాడు.. దీంతో ప్రియురాలు పెళ్లి చేసుకోబోయో యువకున్ని
టార్గెట్ చేసి హత్య చేశాడు..
ప్రేమిస్తే.. పెళ్లి చేసుకోవాలి లేదంటే చంపేస్తాం..ఇప్పుడు ఇదే ధోరణి యువకుల్లో కనిపిస్తోంది. దీంతో అకారణంగా యువతులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు వారికి సహకరించిన వారి నిండు ప్రాణాలను సైతం తీస్తున్నారు. ఇలా తాజాగా ఓ యువకుడు తన ప్రియురాలు దక్కకపోవడంతో భరించలేకపోయాడు.. అయితే తాను ప్రేమించిన ప్రియురాలు తప్పు చేస్తే.. ఆమెను చేసుకోబోయేవాడు బలయ్యాడు..
హుస్నాబాద్ పట్టణానికి చెందిన గుర్రాల హరీశ్ రెడ్డి, అదే గ్రామానికి చెందిన ఓ యువతితో నాలుగు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాడు. అయితే.. ఇద్దరి కులాలు వేరు కావడంతో హరీశ్‌రెడ్డి తల్లిదండ్రులు వారి పెండ్లికి ఒప్పుకోలేదు. దీంతో హరీష్ ప్రేమించిన అమ్మాయికి కుటుంబ సభ్యులు పెళ్లి చేయాలని నిర్ణయించారు.. ఓ వైపు ప్రియుడు పెళ్లి చేసుకోననని చెప్పడం. మరోవైపు సంబంధాలు చూస్తుండడంతో అమ్మాయి పెళ్లి చేసుకోవానికి ఒప్పుకుంది..
ఈ క్రమంలోనే కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామానికి చెందిన పైడి రాజశేఖర్ ను పెండ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. కాగా రాజశేఖర్ కారు డ్రైవర్‌గా చేస్తున్నాడు.. దీంతో హరీశ్ భరించలేకపోయాడు.. తాను ధైర్యంగా పెళ్లి చేసుకోవాల్సింది పోయి.. ప్రియురాలి పెళ్లిని ఆపాలని నిర్ణయించాడు. దీంతో తన ప్రియురాలి పెళ్లి చేసుకోబోయో పెళ్లి కొడుకును చంపాలనే కుట్రకు తెరలేపాడు.
దీంతో అక్టోబర్ 29న తన స్నేహితుడు.. నాగరాజుతో కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లాల్సి ఉందని డ్రైవర్ గా చేసే రాజశేఖర్ ను పిలిచాడు. హుస్నాబాద్‌లో చాకులు, గ్లౌజులు కొన్నారు. బద్దిపడగ అనే గ్రామానికి చేరుకున్న తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి రాజశేఖర్‌ను ఒకరు గట్టిగా పట్టుకోగా, మరొకరు చాకుతో అతని గొంతు, కోసి చాతీపై పొడిచి చంపారు. అనంతరం అక్కడి నుంచి కొద్ది దూరం వెళ్లి మరో స్నేహితుడు శివకు ఫోన్‌చేసి పిలిపించారు. అతడి బైక్‌పై హుస్నాబాద్ వెళుతూ మార్గమధ్యలో ఉన్న బస్వాపూర్ వాగులో కత్తులను, గ్లౌజులను పడేశారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య కేసుగా నమోదు చేసుకుని విచారణ జరిపారు.. దీంతో అసలు విషయం బయట పడింది. దీంతో హత్యకు కారణమైన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.