Home /News /telangana /

Jagityala : ధర్నాలో ఆశా వర్కర్లు... మధ్యలో పెళ్లికూతురు.. హైరానాలో పెళ్లికొడుకు.. ! ఇంతకి పెళ్లి కూతురు ఎలా వెళ్లిందో తెలుసా...?

Jagityala : ధర్నాలో ఆశా వర్కర్లు... మధ్యలో పెళ్లికూతురు.. హైరానాలో పెళ్లికొడుకు.. ! ఇంతకి పెళ్లి కూతురు ఎలా వెళ్లిందో తెలుసా...?

ధర్నాలో చిక్కుకున్న పెళ్లి కూతురు

ధర్నాలో చిక్కుకున్న పెళ్లి కూతురు

Jagityala : ఓ పెళ్లి కూతురుకు ఆశా వర్కర్లు చెమటలు పట్టించారు. ఉరుకులు, పరుగులు పెట్టించి కారులో పెళ్లి మండపానికి వెళ్లాల్సిన ఆమెను చివరకు టూ వీలర్‌ మీద వెళ్లాల్సిన స్థితిని కల్పించారు.

  పెళ్లిల్లు చేసుకునేందుకు ముహుర్తాలు చాలా ముఖ్యం. ఆ ముహుర్తాల బలంపైనే వుధువరుల బంధాలు ముడిపడి ఉంటాయని చాలామంది నమ్ముతారు... అదే ముహాుర్తాల బలంతో పెళ్లి భాజాలు మోగడంతో పాటు మంత్రాల మధ్యలో వరుడు, వధువు ఒక్కటవుతారు... ( Bride goes on bike to function hall ) కాని ఓ పెళ్లికూతురును ఆ ముహుర్తం నానా హైరానాకు గురి చేసింది. పెళ్లి కూతురుగా ముస్తాబై దర్జాగా కారులో ముందు కూర్చుని వెళుతున్న పెళ్లి కూతురు తనకు ఎదురైన సంఘటనతో ఇబ్బంది ఎదుర్కొంది. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు సైతం ఉరుకులు పరుగులు పెట్టారు.. ఓ వైపు పెళ్లి కొడుకు మండపంలో వచ్చి ఉంటే మరోవైపు పెళ్లి కూతురు లేక ఆ మండపం అంతా వెలవెల బోయింది. దీంతో ఎమైందోననే కంగారు పెళ్లి కొడుకులో కూడా స్పష్టంగా కనిపించింది.

  ఆ వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లా టిఆర్‌నగర్ కు చెందిన సాహితికి, మధుకర్ అనే వ్యక్తితో నేడు పెళ్లి జరగాల్సి ఉంది.. మధ్యాహ్నం 12 : 30 నిమిషాలకు పెళ్లి ముహుర్తం నిర్ణయించారు .కాగా నగరంలోని బైపాస్ రోడ్డులో గల నాయిబ్రాహ్మణ సంఘంలో పెళ్లి. ( Bride goes on bike to function hall ) అయితే అంతా రెఢి అయి పెళ్లి కూతురుతోపాటు ఆమె బంధువులు ఓ వెహికిల్ ‌లో ముహుర్తానికి రెండు గంటల ముందే బయలు దేరారు.. పెళ్లి కుమారుడు అప్పటికే మండపానికి వచ్చే సమయంలో ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాల్సిన నేపథ్యంలో వారికి సరిగ్గా అదే సమయంలో వింత పరిస్థితి ఎదురైంది..

  kcr write a letter to pm : సింగరేణి కార్మికులకు సీఎం మద్దతు... వేలాన్ని ఆపాలంటూ పీఎం కు లేఖ.


  అదే సమయానికి కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లతో పాటు ఏఎన్‌ఎంలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వాళ్ల కోసం పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం అయింది.. అక్కడి నుండి ఒక్క అడుగు కూడా వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ముహుర్తానికి ముందే బయలు దేరిన పెళ్లి కూతురు ధర్నాలో చిక్కుకుంది. ( Bride goes on bike to function hall ) ఓ వైపు పెళ్లి ముహుర్తం దగ్గర పడుతుండడంతో వారిని వెళ్లనివ్వాలని చెప్పినా ధర్నా చేస్తున్న ఆశాలు దారిని ఇవ్వలేదు.. దీంతో సుమారు గంటపాటు ఆ ట్రాఫిక్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఆ కుటుంబానికి ఎదురైంది.

  ఇక లాభం లేదనుకుని పెళ్లి కూతురు సోదరుడు ధర్నాకు ఇవతలి వైపుకు వచ్చి ఓ టూ వీలర్‌ను తీసుకున్నాడు. దానిపై పెళ్లి కూతురును తీసుకుని హాడావుడిగా మండపానికి వెళ్లాడు. దీంతో ఆమెతో పాటు వచ్చి కుటుంబ సభ్యులు సైతం కాళ్లకు పని చెప్పారు. ( Bride goes on bike to function hall )నడుచుకుంటూ ట్రాఫిక్ నుండి బయటకు వచ్చారు. ఇలా ఒక్కొక్కరుగా మండపానికి చేరుకున్నారు. అయితే పెళ్లి కూతురును కూడా వెళ్లనీయకుండా చేయడంపై ఆమె బంధువులు ఆశా వర్కర్లపై మండిపడ్డారు. ఒకవేళ పెళ్లి రద్దు అయితే బాధ్యత ఎవరు వహిస్తారని వారు ప్రశ్నించారు.

  Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

  మీ నగరం నుండి (కరీంనగర్)

  తెలంగాణ
  కరీంనగర్
  తెలంగాణ
  కరీంనగర్
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Jagityala, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు