Boy death : సరదాగా ఆడుకుంటుండగా... కర్టెయిన్ మెడకు చుట్టుకుని..!

Boy death : సరదాగా ఆడుకుంటుండగా... కర్టెయిన్ మెడకు చుట్టుకుని..!

Boy death : ఇద్దరు చెల్లెల్లతో ఆటల్లో మునిగిపోయిన ఓ పదకొండేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు..అదికూడా ఇంట్లోని కర్టైయిన్‌ చుట్టుకుని ఊపిరాకుండా ప్రాణాలు విడిచాడు..ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడం..పిల్లలు లోపలి నుండి డోరుకు లాక్‌ చేసుకోవడంతో సకాలంలో పిల్లాడిని రక్షించలేని పరిస్థితి నెలకొంది.

  • Share this:
కరోనా నేరుగా ప్రాణాలు తీయడమే కాకుండా..దాని ప్రభావంతో ఇంట్లో ఉంటూ.. స్కూలుకు వెళ్లలేని స్థితిలో ఉన్న పిల్లలు సైతం పరోక్షంగా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితిని తీసుకువస్తోంది. ఇలా ఓ పిల్లాడు తన ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది.

మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలానికి చెందిన శ్రీనివాస్, శాంతి దంపతులు ఘట్‌కేసర్ వచ్చి స్థానికంగా టీవి రిపేర్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. తల్లీ ఇతర కూలీ పనులు చేస్తోంది..కాగా వీరికి ముగ్గురు సంతానం. ఉదయం ఎవరి పనులకు వారు పోయిన తర్వాత పిల్లలు ఇంట్లోని ఉంటున్నారు. ఇలా కరోనా కారణంతో పిల్లలు గత సంవత్సర కాలంగా కాలం వెళ్లదీస్తున్నారు. వారిలో భార్గవ్ 11 సంవత్సరాలు కాగా ప్రస్తుతం అయిదవ తరగతి చదువుకుంటుండగా అతని ఇద్దరు చెల్లెలు 3, 5 సంవత్సరాలు.

అయితే బుధవారం యథావిధిగా శ్రీనివాస్ టీవి రిపెర్ షాపుకు వెళ్లగా, శాంతి ఇంటి పనులకు వెళ్లింది. దీంతో ముగ్గురు పిల్లలు ఇంటి మెయిన్ డోర్ పెట్టుకుని లొపల ఆడుకుంటున్నారు. ఇలా రోజు కొనసాగతుండగా బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు లోపలి నుండి పిల్లాడి కేకలు వినిపించాయి.

దీంతో స్థానికులు వెళ్లి చూడడంతో డోరుకు గడియ పెట్టి ఉంది. దీంతో వారు 100కు డయల్ చేసి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లారు.

అయితే అప్పటికే భార్గవ్ మెడకు డోర్ కర్టెన్ మెడకు చుట్టుకుని ఉంది..దీంతో వెంటనే భార్గవ్‌ను ఆసుపత్రికి తరలించారు. కాని అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు.పిల్లలు ఆడుకుంటున్న సమయంలోనే భార్గవ్ మెడకు కర్టయిన్ మెడకు చుట్టుకుని ఉంటుందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.

కాగా
Published by:yveerash yveerash
First published: