హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nizamabad : బాలుడి వైద్యానికి రెండున్నర కోట్లు.. ఆదుకోవాలంటూ దాతలకు వినతి..

Nizamabad : బాలుడి వైద్యానికి రెండున్నర కోట్లు.. ఆదుకోవాలంటూ దాతలకు వినతి..

వ్యాధి భారిన పడిన బాలుడు

వ్యాధి భారిన పడిన బాలుడు

Nizamabad :పుట్టింది మధ్యతరగతిలో ..వచ్చింది మాత్రం తనకు స్థోమతకు అందలేని చికిత్స.. అందుకే ఆ బాలుడు తన చికిత్స కొసం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. తాన వ్యాధికి సంబంధించి సహకరించాలని సీఎం కేసిఆర్‌కు మొర పెట్టుకున్నాడు..

మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఓ బాలుడికి అరుదైన జన్యుసంబంధమైన వ్యాధి భారినపడ్డాడు.. అప్పటికే బతుకు దెరువు కోసం దేశం విడిచి బాలుడి తండ్రి గల్ఫ్ వెళ్లిపోగా తల్లి ఇంటివద్దే బీడీలు చుడుతూ కాలం వెల్లదీస్తున్నారు. అలాంటీ సమయంలో వారి కుటుంబంలో ఓ అరుదైన వ్యాధి సోకింది.

వివరాల్లోకి వెళితే..  నిజామాబాద్ జిల్లా జ‌క్రాన్ ప‌ల్లి మండ‌లం ప‌డ‌క‌ల్ గ్రామానికి చెందిన వోల్కాజి ప్ర‌తిమా, శ్రీనివాస్ దంప‌తులు.. వీరికి ముగ్గురు సంతానం.. ఇద్ద‌రు కూతుళ్లు, ఓ బాబు.. బ్ర‌తుకు దేరువు కోసం గత పది సంవత్సరాల క్రితమే శ్రీనివాస్ గ‌ల్ప్‌కు వెళ్లి ఓ ప్రైవేటు కంపనీలో పని చేస్తున్నాడు. త‌ల్లి బీడీలు చూడుతూ కుటుంబాన్ని పోషించుకుంది.. అయితే గ‌త సంవ‌త్సరం బాబు హ‌రిచ‌ర‌ణ్ ఆనారోగ్యానికి గుర‌య్యాడు.. దీంతో  బాబును ఆసుప‌త్రికి తీసుకువెళితే వైద్యులు పలు ప‌రీక్ష‌లు చేసారు.. అయినా స‌రైనా వైద్యం అంద‌లేదు..


Waranagal : ప్రియుడి డబ్బుతోనే కిడ్నాప్..భయపెట్టి, బలవంతంగా.. అడవిలోకి తీసుకువెళ్లింది..ఆ తర్వాత..

చివ‌ర‌కు క‌ర్నాట‌క లోని ప్రముఖ ఆసుపత్రి అయిన సీఎంసీ ఆసుప‌త్రికి తీసుకు వెళ్లారు.. .. అక్క‌డి వైద్యులు ప‌రీక్షించి జ‌న్యు సంబంధిత (డీఎన్ఏ) కీళ్ల క్షీణత వ్యాధి ఉంద‌ని నిర్ధారించారు. అయితే ఆ వ్యాది నివారణ కోసం చికిత్స ఉంటుందని అయితే ఇందుకోసం ఓ ఎస్టిమేషన్ కూడా వేసి ఇచ్చారు.. అయితే చికిత్స కోసం సుమారు రెండు కోట్ల యాబై లక్షల రుపాయ‌లు ఖర్చు ఆవుతుంద‌ని వైద్యులు చెప్పారు.. అయితే ఆంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసే స్థోమ‌త లేని త‌ల్లి దండ్రులకు లేదు. దీంతో దాతల సహాయం కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తోంది. దీంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ బాలుడిని ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఎనిమిది సంవత్సరాల వయస్సులోనే తన నిండి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టకుండా వైద్యం అందించాలని బాలుడు సైతం కోరుతున్నాడు.

First published:

Tags: Nizamabad, Telangana