Mulugu : గాయమని ఆసుపత్రికి వెళితే.. చిన్నోడి చేయినే తీసేలా చేశారు..!

Mulugu : గాయమని ఆసుపత్రికి వెళితే.. చిన్నోడి చేయినే తీసేలా చేశారు..!

Mulugu : వైద్యుల నిర్లక్ష్యం అడుతూ పాడుతూ ఉండే ఓ బాలుడికి ఒంటి చేతి జీవితాన్ని మిగిల్చారు.. చేతికి గాయమని చికిత్స కోసం వెళితే.. ఆ చేయినే లేకుండా చేశారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు.

  • Share this:
    ములుగు జిల్లా ( mulugu ) కన్నాయిగూడెం మండలం ఐలాపురం గ్రామానికి చెందిన మండపల్లి దుర్గయ్య, సమ్మక్క దంపతుల కుమారుడు నతానియేలు.. గత ఆగస్టు 17న ఫ్రెండ్స్‌తో ( friends )ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తు కింద పడ్డాడు.దీంతో ఆ బాలుడి చేతికి గాయమైంది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. బాలుడిని ఏటూరునాగరంలోని (Eturunagaram ) ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుడు ప్రాథమిక చికిత్స చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్టు వేసి పంపించారు.

    అయితే చేయిని సరిగా పరీక్ష చేయని వైద్యులు రోటిన్‌గా వైద్యం అందించారు. దీంతో ఇన్‌ఫెక్షన్‌ సోకి వైద్యులు ( doctor ) కట్టిన కట్టుకు చేయి కుళ్లిపోయింది. అనంతరం నాలుగు రోజులకు చేయి వాపు పెరిగి, నొప్పి తీవ్రం కావడంతో మళ్లీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు.

    ఇది చదవండి :  అతి భక్తితో దారుణం... గుడికి వెళ్లి వచ్చిన భార్యపై భర్త దారుణం..


    దీంతో బాలుడి చేయిని పరిశీలించి చేయి కుళ్లిపోయిందని వరంగల్‌లోని ఎంజీఎం ( Waranagal MGM )ఆస్పత్రికి తీసుకువెళ్లమని చెప్పారు. ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు పరిశీలించి మరో ఎముకల ఆస్పత్రిని సూచించారు. అక్కడ వైద్యులు ఆపరేషన్ చేసి చేతిని తొలగించారు.

    దీంతో బాలుడి తల్లిదండ్రులు చికిత్స చేసిన ఏటూరునాగారంలో చికిత్స చేసిన వైద్యుడిని నిలదీశారు.. దీంతో ఆపరేషన్​కు రూ. 10వేలు ఇస్తానని చెప్పారు. వైద్యుల వాదన మరోలా ఉంది.. తాము బోన్స్ చికిత్స చేయలేదని.. ఎక్స్ రే మాత్రమే తీసి బోన్‌కు గాయం కావడంతో ప్లాస్టర్​ ఆఫ్ పారిస్​తో కట్టు కట్టినట్లు పేర్కొన్నారు. అయితే.. బాలుడి తల్లిదండ్రులే సగం కట్టు వరకు తొలగించి నాటు మందు కట్టు చేయించుకున్నారని చెప్పారు. దాని వల్లే ఇబ్బంది తలెత్తి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో విషయం జిల్లా వైద్యాధికారులకు చేరడంతో జరిగిన సంఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

    ఇది చదవండి : గ్రేట్ సీఎం.. సాధారణ ప్రజలతోనే ప్రయాణం.. తన సెక్యూరిటిపై కూడా...!

    Published by:yveerash yveerash
    First published: